రిజర్వేషన్ల రాజకీయం

ABN , First Publish Date - 2021-02-28T04:58:31+05:30 IST

నగరంలో ఏడు విలీన గ్రామాల అనంతరం డివిజన్ల స్వరూపమే మారిపోయింది.

రిజర్వేషన్ల రాజకీయం

ఇష్టారాజ్యంగా డివిజన్ల మార్పు 

అస్తవ్యస్తంగా రిజర్వేషన్లు అమలు

బలమైన ప్రతిపక్ష అభ్యర్థుల ఓటమే లక్ష్యం

ఏలూరు టూటౌన్‌, ఫిబ్రవరి 27 :

నగరంలో ఏడు విలీన గ్రామాల అనంతరం డివిజన్ల స్వరూపమే మారిపోయింది. గ్రామాలు కలవడం వల్ల ఇది జరిగిందని భావిస్తే పొరబాటే. ఇందులో సర్దుబాటు కంటే అధికార పార్టీ నాయకుల రాజకీయ కోణమే ఎక్కువ ఉందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నా రు. అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు బలంగా ఉన్న డివిజన్లలోనే ఈ మార్పులు ఎక్కువగా జరగడం గమనార్హం. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థుల పట్టు ఎక్కు వగా ఉన్న సుమారు 15 నుంచి 20 డివిజన్ల రిజర్వేషన్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ రిజర్వేషన్ల అమలులో నిబంధనలు పాటించలేదని ప్రతిపక్షాల వాదన.  

 


ఏలూరు నగరంలో విలీన మైన ఏడు గ్రామాలను 50 డివిజన్లలో సర్దుబాటు చేశారు. దీంతో డివిజన్లన్నీ తారుమారయ్యాయి. పాత డివిజన్లు అన్నీ పూర్తిగా మారిపోయాయి. ఒక్కో డివిజన్‌ను విడదీసి మూడు నాలుగు డివిజన్లలో కలిపారు. దీనిని అదునుగా తీసుకుని అధి కార పార్టీ నాయకులు రిజర్వేషన్లలో రాజకీయం చేశారన్న ఆరో పణలు విన్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన బలమైన నాయకుల డివిజన్లను పూర్తిగా మార్చివేశారు. దీంతో టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్న 15 నుంచి 20 డివిజన్లు పూర్తిగా మారిపోయాయి. గెలిచే అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా రిజర్వేషన్ల పేరుతో అధికార పార్టీ నాయకులు రాజకీ యం నడిపారని పలువురు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నగరం లోని 50 డివిజన్లలో రిజర్వేషన్లలో అన్ని అవకతవకలే. ఓసీ డివిజన్లు ఎస్సీ ల్లోకి, బీసీ డివిజన్లు ఓసీల్లోకి, ఎస్సీ, ఎస్టీ డివిజన్లు బీసీ, ఓసీల్లోకి మార్పు లు చేశారు. ఉదాహరణకు మూడో డివిజన్‌ను చాలా మట్టుకు నాల్గొవ డి విజన్‌లో కలిపేశారు. గతంలో ఇది ఎస్సీ రిజర్వుడు. ఇక్కడ మాజీ కార్పొ రేటర్‌ బలంగా ఉండడంతో అతనికి టిక్కెట్‌ రాకుండా చేయడం కోసం డివిజన్‌ మార్చివేశారు. 49వ డివిజన్‌లో డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన బీసీకి చెందిన మాజీ కార్పొరేటర్‌ తప్పకుండా గెలు స్తారనే ఉద్దేశ్యంతో దీనిని ఎస్టీకి రిజర్వు చేశారు. వాస్తవానికి ఈ డివిజన్‌లో 120 మంది ఎస్టీలు ఉంటే 2,501 మంది ఎస్టీలు ఉన్నట్టు ఓటర్ల జాబితాలో చూపించారు. 34వ డివిజన్‌కు చెందిన బలమైన ఓసీ అభ్యర్థికి టిక్కెట్‌ రాకూడదనే ఉద్దేశ్యంతో ఇక్కడ బీసీ మహిళకు రిజర్వు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 17వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ బలమైన అభ్యర్థి కావడంతో ఓసీ జనరల్‌గా మార్చేశారు. 23, 24 డివిజన్లది ఇదే పరిస్థితి. ఈ రెండు డివిజన్లను కలిపి బీసీలకు రిజర్వు చేయించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా 50 డివిజన్లలో సగం డివిజన్లు రిజర్వేషన్‌ పేరుతో రాజకీయ మార్పులు జరిగాయి. ఇప్పటికైనా సరైన ఓటర్ల జాబితాను తయారు చేసి రిజర్వేన్లు సరిగ్గా అమలు చేయాని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నారు. 





Updated Date - 2021-02-28T04:58:31+05:30 IST