చంద్రబాబు ఇంటిపై దాడి హేయం

Sep 17 2021 @ 23:45PM
నిరసన తెలుపుతున్న బడేటి చంటి, టీడీపీ నాయకులు

 ధ్వజమెత్తిన టీడీపీ శ్రేణులు.. జోగి రమేశ్‌ దిష్టిబొమ్మ దహనం

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, సెప్టెంబరు 17 : తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆగ్రహం వ్యక్తం చేశారు. బడేటి క్యాంపు కా ర్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పని తీరు, మంత్రులు, ముఖ్యమంత్రి తీరుపై టీడీపీ నాయ కుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు సహేతుకమే అన్నారు. జోగి రమేష్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇంటిపై దాడులు చేయించిన జోగి రమేష్‌, ఆయన రౌడీ మూకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి దాడులు ఆపక పోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం జోగి రమేశ్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి అంజనేయులు, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాల రావు, మాజీ డిప్యూటీ మేయర్లు నెర్సు గంగరాజు, చోడే వెంకటరత్నం, మాజీ కార్పొరేటర్‌ దాకారపు రాజేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పూజారి నిరంజన్‌, కంప్యూటర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


దాడులను ఖండించిన టీడీపీ నాయకులు

పార్టీ కార్యాలయ సమ్వనయ కార్యదర్శి పాలి ప్రసాద్‌, జడ్పీ మాజీ కొక్కిరగడ్డ జయరాజు చంద్రబాబు నివాసంపై వైసీపీ అల్లరిమూకల దాడులను తీవ్రంగా ఖండించారు. రాబోయే రోజుల్లో ఇదే విధంగా ప్రవర్తిస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన వస్తుందని హెచ్చరించారు. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకుని ఉందన్నారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సమంజసమేనన్నారు.


పెదపాడు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ శ్రేణులు  దాడులకు దిగడం హేయమైన మండల టీడీపీ నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. పార్టీ నాయకుల పైనా, కార్యకర్తలపైనా దాడులకు పాల్పడడం పిరికిచర్య అని, ఇటువంటి చర్యలను ఎదుర్కొనేందుకు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు   సిద్ధ మేనని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు లావేటి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసేవిధంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని ఏలూరు పార్లమెంటరీ తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు వడ్డి వాసవి, టీడీపీ నాయకులు వేమూరి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెల కొల్పాల్సిన వారే దాడులతో భయాందోళనలు సృష్టిస్తున్నారని అప్పనవీడు గ్రామపార్టీ అధ్యక్షుడు బెక్కం లక్ష్మీనారాయణ, గూటాల సంజీవరావు అన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.