గ్రామాల్లో ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2022-01-23T05:34:50+05:30 IST

కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అంగ న్వాడీల ఆధ్వర్యంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని తహసీల్దార్‌ నాంచారయ్య, ఎంపీడీవో లక్ష్మీ తెలిపారు.

గ్రామాల్లో ఫీవర్‌ సర్వే
చాటపర్రులో శానిటేషన్‌ చేస్తున్న పారిశుధ్య కార్మికులు

 పెరుగుతున్న కరోనా కేసులు
ప్రత్యేక శానిటేషన్‌.. వైద్య సిబ్బంది అప్రమత్తం



ఒకవైపు కరోనా మరోవైపు ఒమైక్రాన్‌ జనాన్ని భయపెడుతున్నాయి. జ్వరం వస్తే చాలు బెంబెలెత్తే పరిస్థితి నెలకుంది. ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండడంతో మరింత హడలెత్తుతున్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో ముమ్మరంగా  ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఏలూరు రూరల్‌ మండలంలో కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా కన్పిస్తోంది. ప్రతిరోజూ 20 నుంచి 30కు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

దెందులూరు, జనవరి 22 : కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అంగ న్వాడీల ఆధ్వర్యంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని తహసీల్దార్‌ నాంచారయ్య, ఎంపీడీవో లక్ష్మీ తెలిపారు. దెందులూరు, కొవ్వలి, పోతునూరు, చల్లచింతలపూడి గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి దగ్గు, జలుబు, జ్వరాలపై వివరాలు నమోదు చేసుకుని తేడా ఉన్న వారిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా, ఒమైక్రాన్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ, చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని తహసీల్దార్‌ నాంచారయ్య తెలిపారు.

ఏలూరు రూరల్‌ మండలంలో 37 కేసులు
ఏలూరు రూరల్‌, జనవరి 22: మండలంలో కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా చాపకింద నీరులా కొవి డ్‌ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 40 కేసులు నమోదు కాగా, శనివారం మరో 37 కేసులు నమోదయ్యాయి. గడిచిన కొన్ని నెలలుగా నెమ్మదించిన కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడడంతో పాజిటివ్‌ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ వచ్చిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి వైద్య, ఆశ, వలంటీర్లు ఫీవర్‌ సర్వే నిర్వ హిస్తున్నారు. అత్యంత జాగ్రత్తగా ఉన్నా కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండి వ్యాక్సిన్‌ వేయించుకోవాలని మం డల వైద్యాధికారి డాక్టర్‌ దేవ్‌మనోహర్‌ కిరణ్‌ తెలిపారు.

 దెందులూరు మండలంలో 4

దెందులూరు, జనవరి 22: మండలంలో శనివారం దెందులూరులో ఇద్దరు, గోపన్నపాలెంలో ఒక్కరు, కొవ్వలిలో ఒక్కరు కరోనా పాజిటివ్‌ బారిన పడినట్టు అధికారులు తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని, శానిటైజర్‌తో చేతులను తరచూ శుభ్రం చేసుకుంటు ఉండాలని ప్రభుత్వ వైద్యులు సూచిస్తున్నారు.
 
పెదపాడు మండలంలో 15
పెదపాడు, జనవరి 22: మండలంలో శనివారం 15 కొవిడ్‌ కేసులు నమోద య్యాయి. వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో వట్లూరులో 4, కలపర్రులో 3, అప్పన వీడులో ఒకటి, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో పెదపాడు, వసంతవాడ, కొత్త ముప్పర్రు గ్రామాల్లో రెండేసి, వీరమ్మకుంటలో ఒక కేసు నమోదైనట్టు వైద్య సిబ్బంది తెలిపారు. అలాగే కొవిడ్‌తో పాటుగా ఇతర వైద్యసేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఆరుగురు కొవిడ్‌ బారినపడి హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

Updated Date - 2022-01-23T05:34:50+05:30 IST