బియ్యంపై బాదుడు

ABN , First Publish Date - 2022-08-13T05:48:53+05:30 IST

వాస్తవానికి బియ్యంపై 5 శాతం జీఎస్టీని అమలు చేస్తూ జూలైలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బియ్యంపై బాదుడు

25 కిలోలు అంతకన్నా తక్కువ ప్యాకింగ్‌లపై 5 శాతం  జీఎస్టీ  వడ్డన
తెలివిగా వ్యవహరిస్తున్న వ్యాపారులు
ఇకపై 26 కిలోల ప్యాకింగ్‌తో  విక్రయాలు
పాత నిల్వల వరకే  25 కిలోలు..
అంతిమంగా లబ్ధి పొందేది వ్యాపారులే
మరోవైపు జీఎస్టీ నెపంతో  బియ్యం ధరలు పెంపు


ప్రజలు నిత్యం వినియోగించే బియ్యంపై ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసింది. వ్యాపారుల విక్రయాలను నిశితంగా పరిశీలించి మార్గదర్శ కాలను విడుదల   చేసింది. ప్రభుత్వ నిర్ణ యం చూస్తే ఎవ రైనా ఆశ్చర్యపోతారు. కానీ వ్యాపారులు అంతకంటే తెలివిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిబంధ నలకు దొరకకుండా ప్యాకింగ్‌ చేసేలా కసరత్తు చేస్తున్నారు. జీఎస్టీ పడకుండా ఇకపై 26 కిలోల ప్యాకింగ్‌తో బియ్యం విక్రయిం చేలా నిర్ణ యించారు. మరో వైపు జీఎస్టీ వంకతో పాత నిల్వలపైనా ధరలు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ నిర్ణయం చివరకు వ్యాపారులకు వరంగా మారింది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)
వాస్తవానికి బియ్యంపై 5 శాతం జీఎస్టీని అమలు చేస్తూ జూలైలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచే వ్యాపారులు బియ్యం ధరలను పెంచే శారు. జీఎస్టీ పేరుతో 25 కిలోల బియ్యం ప్యాకెట్‌పై రూ.50 ధర పెంచి విక్రయిస్తున్నారు. ఈ కారణంగా ఉదా హరణకు ఇప్పటి వరకు రూ.1,150లకు లభ్యమయ్యే బియ్యం ఇప్పుడు రూ.1200లకు చేరింది. ఇలా వ్యాపారులు నష్టపో కుండా అదనపు లబ్ధి పొందుతున్నారు. వాస్తవానికి మార్కెట్‌లో కొత్తగా దిగుమతి అయ్యే ప్యాకింగ్‌ పైనే జీఎస్టీ అమలు జరగనుంది. దాని పేరుతో పాత నిల్వల పైనా వ్యాపారులు ధరలను పెంచుతూ విక్రయిస్తున్నారు. సన్న రకాలు తయారు చేసే బడా మిల్లర్లే ధరలను పెంచి లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం జీఎస్టీ అమలులో ఆచి తూచీ వ్యవహరించింది. ప్రభుత్వంపై జీఎస్టీ భారం పడ కుండా చర్యలు తీసుకుంది. కేవలం 25 కిలోలు, అంత కంటే తక్కువగా ప్యాకింగ్‌ చేయడంతో పాటు, పైన లేబు ల్‌ ఉంటే 5 శాతం జీఎస్టీ అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఆ లెక్కన వ్యాపారులు విక్రయించే బియ్యానికే పన్ను వర్తిస్తుంది. మార్కెట్‌లో లేబుళ్లతో ప్యా కింగ్‌ ఉండే బియ్యమంతా 5, 10, 25 కిలోలు వంతున లభ్యమవుతున్నాయి. వాటిపై ఇప్పుడు పన్ను పడనుంది. వాస్తవానికి బియ్యంపై జీఎస్టీ లేదంటూ పన్ను అమలు లోకి వచ్చిన నాడే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం బ్రాండెడ్‌ రకాలుగా రిజిస్ర్టేషన్‌ చేసుకున్న రకాలకు మాత్ర మే జీఎస్టీ వర్తిస్తుందంటూ స్పష్టం చేసింది. మార్కెట్‌లో లభ్యమవుతున్న బియ్యానికి ఏదో ఒక బ్రాండ్‌ పేరు ఉంది. దాంతో అంతా జీఎస్టీలోకి వచ్చేస్తుందని ప్రభుత్వం భావిం చింది. అయితే అప్పట్లోనే వ్యాపారులు తెలివిగా వ్యవహ రించారు. రిజిస్ర్టేషన్‌ చేసుకున్న బ్రాండెడ్‌ రకాలను రద్దు చేసుకున్నారు. వాటిముందు కేవలం శ్రీని తగిలిస్తూ అన్‌ బ్రాండెడ్‌గా మార్కెట్‌లోకి విడుదల చేశారు. కానీ ప్రజల మనస్సుల్లో అవి బ్రాండెడ్‌గానే ముద్రపడిపోయాయి.  వ్యాపారులు, ప్రభుత్వం లెక్కల్లో అవి అన్‌ బ్రాండెడ్‌ రకా లుగానే చలామణి అవుతున్నాయి. ఇలా తెలివిగా వ్యవహ రించిన వ్యాపారులు జీఎస్టీ నుంచి ఉపశమనం పొందారు. దీనిపై ప్రభుత్వం  మల్లగుల్లాలు పడింది. దాదాపు మూ డేళ్ల తర్వాత కొత్త ప్రయోగం తెరపైకి తెచ్చింది. మార్కె ట్‌లో లభ్యమవుతున్న బియ్యం పరిమాణాన్ని బట్టి జీఎస్టీ విధించింది. ప్రభుత్వం సేకరిస్తున్న బియ్యానికి జీఎస్టీ వర్తించకుండా జాగ్రత్త పడింది. మిల్లర్ల నుంచి 50 కిలోలు వంతున సేకరిస్తుండడంతో జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారులే జీఎస్టీ పరిధిలోకి వచ్చేశారు.

ఇకపై 25 కాదు..26 కిలోల ప్యాకెట్లు
ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న జీఎస్టీ విధానం నుంచి తప్పు కోవడానికి వ్యాపారులు సన్నద్ధమవుతు న్నారు. చిన్న ప్యాకింగ్‌లు, 25 కిలోలు బియ్యం ప్యాకెట్‌ లు విడుదల చేయకూడదని నిర్ణయించున్నారు. సన్న బియ్యం ఉత్పత్తి చేసే మిల్లర్లంతా ఏకమయ్యారు. ఇకపై 26 కిలోలు ప్యాకింగ్‌ బియ్యాన్ని మార్కెట్‌లోకి తేనున్నా రు. ఆ మేరకు కిలో బియ్యం ధరను అదనంగా పెంచ నున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. త్వరలోనే కొత్తప్యాకింగ్‌లతో బియ్యం మార్కెట్‌లోకి విడు దల కానున్నాయి. ప్రభుత్వానికి ఝలక్‌ ఇవ్వనున్నాయి. మరోవైపు అదనపు లబ్ధి చేకూరింది. జీఎస్టీ విధించారన్న నెపంతో ఒక్కో బియ్యం ప్యాకెట్‌పై రూ.50 ధరను పెంచే శారు. ఇలా ప్రభుత్వం నిర్ణయం అంతిమంగా వ్యాపారు లకే లబ్ధి చేకూర్చింది.

Updated Date - 2022-08-13T05:48:53+05:30 IST