జంగారెడ్డిగూడెంలో చిరంజీవి ఆస్పత్రి సీజ్‌

ABN , First Publish Date - 2022-07-03T06:56:22+05:30 IST

జిల్లా వైద్యాధికారుల ఆదే శాలతో జంగారెడ్డిగూడెంలో చిరంజీవి ఆస్పత్రిని శనివారం అధికారులు సీజ్‌ చేశారు.

జంగారెడ్డిగూడెంలో చిరంజీవి ఆస్పత్రి సీజ్‌

జంగారెడ్డిగూడెం, జూలై 2: జిల్లా వైద్యాధికారుల ఆదే శాలతో జంగారెడ్డిగూడెంలో చిరంజీవి ఆస్పత్రిని శనివారం అధికారులు సీజ్‌ చేశారు. ప్రభుత్వ గుర్తింపును 45 రోజుల పాటు రద్దు చేస్తూ, ఓపీ, ఐపీ విభాగాలను నిలుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అతిక్రమిస్తే చర్యలు తీసు కుంటామని డివిజనల్‌ వైద్యాధికారి డాక్టర్‌ రాజీవ్‌ హెచ్చ రించారు. బుట్టాయిగూడెం మండలానికి చెందిన కబడ్డీ క్రీడాకారిణి, గిరిజన బాలిక మొడియం మంగ చిరంజీవి ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందింది. తమ కుమార్తె మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమని చర్యలు తీసు కోవాలని ఆమె తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవి ఆస్పత్రిలో ఇటీవల విచారణ చేసి మల్టీస్పెషాలిటీ ప్రమాణాలు లేకపోవడాన్ని గుర్తించి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. వివరణ సరిగ్గా లేకపోవడంతో గుర్తింపును 45 రోజుల పాటు రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. 45 రోజుల్లో సౌకర్యాలు కల్పించి రికార్డు అందజేస్తే తిరిగి నడిపేందుకు అవకాశం ఉంటుందని డివిజనల్‌ వైద్యాధికారి డాక్టర్‌ రాజీవ్‌ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఇక్కడ ఆపరేషన్‌ చేయడం, మంగ మృతి పై ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు వైద్యులు చంద్రశేఖర్‌, రాకేష్‌లను రెండు రోజుల క్రితం సస్పెండ్‌ చేశారు.

Updated Date - 2022-07-03T06:56:22+05:30 IST