గూడు..గోడు..

ABN , First Publish Date - 2021-01-25T06:00:31+05:30 IST

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా జిల్లాలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉంది.

గూడు..గోడు..

రెండేళ్లుగా వ్యక్తిగత ఇళ్ల బిల్లులు పెండి ంగ్‌

అప్పుల్లో కూరుకుపోయిన లబ్ధిదారులు.. సొమ్ముల కోసం ఎదురుచూపులు 

బకాయిలు రూ.100 కోట్లు

మార్చిలో జమ చేస్తామంటున్న అధికారులు


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా జిల్లాలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 20 వేల మంది లబ్ధిదారులు వ్యక్తిగత ఇళ్లు నిర్మించుకున్నారు. వారికి సుమారు రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంది. దశల వారీగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేసేందుకు కసరత్తు చేసింది. పట్టణాల పరిధిలో లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో తొలుత పట్ట ణాల్లో బకాయిలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకు న్నారు. దాదాపు రూ.10 కోట్లు మేర లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మరో రూ.100 కోట్లు బకాయిలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలోనే లబ్ధిదారులు అధికంగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం పెద్దఎత్తున వ్యక్తిగత ఇళ్లు నిర్మించింది. అప్పటి నుంచి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల స్థలాలపై దృష్టి సారించింది. గడచిన బకాయిలను చెల్లించడంలో తాత్సారం చేస్తూ వస్తోంది. నిధులు లభ్యత లేకపోవడంతో  సొమ్ములు చెల్లించడం లేదని అధికారులు చెపుతూ వచ్చారు. లబ్ధిదారుల బకాయిలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. బ్యాం కు ఖాతాలను పొందుపరిచారు. బకాయిలు వారి ఖాతాల్లోనే నేరుగా జమ కావాల్సి ఉంది. ఆధార్‌ నెంబర్‌లు, బ్యాంకు ఖా తాల్లో తప్పులు దొర్లితే హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు సరి చేయ నున్నారు. మండలాల్లో ఉన్న గృహ నిర్మాణ అధికారులు ఇప్పటివరకు తప్పులను సరిచేస్తూ వచ్చారు. 

సచివాలయాలకు బదలాయించినా..

తాజాగా ఆ విధులను సచివాలయాలకు బదలాయించారు. సచివాలయంలో ఉన్న హౌసింగ్‌ కార్యదర్శి తప్పులను సరిచే యనున్నారు. అలాగే కొత్తగా నిర్మించే ఇళ్ల నిర్మాణ బాధ్య తలను నిర్వహించనున్నారు. గతంలో హౌసింగ్‌ ఏఈ నిర్వ హించే విధులను ఇప్పుడు సచివాలయ కార్యదర్శికి అప్పగిం చారు. బకాయిల విషయంలోనూ తప్పులను సరిచేసే పనిని సచివాలయంలోనే నిర్వహిస్తారు. అక్కడ కాదనుకుంటే ఏఈ కార్యాలయంలో సరిదిద్దనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో లబ్ధిదా రుల బిల్లులు నమోదయ్యాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే లబ్ధిదా రుల ఖాతాలో  సొమ్ములు జమకానున్నాయి. మార్చిలోగా పూర్తిస్థాయిలో సొమ్ములు విడుదల చేయనున్నా మని హౌసింగ్‌ ఎస్‌ఈ రామచంద్రారెడ్డి తెలిపారు. 

అప్పులు చేసి వ్యక్తిగత ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80 లక్షలు కేటాయించింది. పట్టణాల్లో అయితే రూ.2.50 లక్షలు ఇచ్చే వారు. తమకు నచ్చిన రీతిలో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకో వడానికి గతంలో అవకాశం కల్పించారు. దాంతో లక్షలు వెచ్చించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్నారు. అయితే ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు అప్పుల్లో కూరుకుపోయారు. బకాయిల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.  


Updated Date - 2021-01-25T06:00:31+05:30 IST