సుస్థిర అభివృద్ధికి సమష్టి కృషి

ABN , First Publish Date - 2022-08-16T05:36:21+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో సోమవారం 76వ స్వాతంత్య్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.

సుస్థిర అభివృద్ధికి సమష్టి కృషి
ఇన్‌చార్జి మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి

సాంస్కృతిక వారసత్వ మానవాభివృద్ధికి సహకరిద్దాం..
మత్స్య సంపదలో మరింత అభివృద్ధి సాధిస్తాం..
స్వాతంత్య్ర వేడుకల్లో ఇన్‌చార్జి   మంత్రి  దాడిశెట్టి రాజా

భీమవరం, ఆగస్టు 15 : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో సోమవారం 76వ స్వాతంత్య్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లాల పునర్విభజన అనంతరం తొలిసారిగా జిల్లాలో నిర్వహిస్తున్న పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) పాల్గొన్నారు. తొలుత ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ  దేశం అంత టా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ భీమవరంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆర్థిక స్థితి కల్పించే దిశగా నవరత్నాల పథకాలను కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా అందజేస్తున్నామన్నారు.
కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలు ..
వ్యవసాయ జిల్లాలో 96 వేల హెక్టార్లలో వరి సాగు చేస్తుంటే 6.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు. దీనిని 389 రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామన్నారు. పెట్టుబడి భరోసాగా వీరికి రూ.207 కోట్లు, వడ్డీ రాయితీగా మరో 30 కోట్లు, పంట బీమా పథకంలో రూ.93.18 కోట్లు జమ చేశామన్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా జిల్లాలో సుమారు 1.4 లక్షల మంది తల్లులకు 15 వేలు రూపాయల చొప్పున రూ.221 కోట్లు అందజేశామన్నారు. మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద 727 పాఠశాలలను ఎంపిక చేసి రూ.262 కోట్లుతో మౌలిక వసతులు కల్పించామన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సక్రమ అమలుకు జిల్లాలో 515 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి 4,400 పోస్టులను భర్తీ చేశామన్నారు. 8,660 వలంటీర్లను నియమించా మన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక సమస్యలను జవాబుదారీతనంతో పరిష్కరించే దిశగా ప్రతీ సోమవారం స్పందన నిర్వహిస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకానికి అర్హులైన 779 చేనేత కుటుంబాలకు నెలకు 2000 చొప్పున సంవత్సరానికి రూ.24,000 ప్రోత్సహంగా అందిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతీ నెల 2లక్షల 18వేల 485 మందికి అన్ని రకాల పెన్షన్లు కింద రూ.55.07 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 4.68 వేల పశువులకు రోగ నిరోధక టీకాలు అందజేస్తామన్నారు. జిల్లాలో కీలకమైన మత్స్యశాఖ ద్వారా 44 వేల హెక్టార్ల విస్తీర్ణం నుంచి వేల కోట్లు ఆదాయం లభిస్తోందన్నారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాడానికి కృషి చేస్తామన్నారు. విద్య, వైద్య ఆరోగ్యం, పౌరసరఫరాలు, డీఆర్‌డీఏ, పరిశ్రమలు, జల వనరులు, విద్యుత్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, స్త్రీ శిశు సంక్షేమం, తదితర శాఖల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా యంత్రాగానికి అభినందనలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల ప్రదర్శనకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పోలీస్‌ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వేడుకలలో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి,  ఎస్పీ యు.రవిప్రకాష్‌, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, ఇన్‌చార్జి జేసీ  కె.కృష్ణవేణి, నరసాపురం సబ్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌, భీమవరం ఆర్డీవో దాసిరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.  

 అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
భీమవరం టౌన్‌, ఆగస్టు 15 : పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారిగా జిల్లా కేంద్రమైన భీమవరంలోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా పరెడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాక తీయ విద్యార్థులు  దేశభక్తి గీతంతో సాంస్కృతిక కార్యక్రమా లను ప్రారంభించారు. విశ్వకవి విద్యార్థుల దేశ రక్షణలో సైనికుల పాత్రను వివరిస్తూ చేసిన నృత్యం ఆకట్టుకుంది. డీఎన్‌ఆర్‌ ఇంగ్లీస్‌ మీడియం విద్యార్థుల రోప్‌ విన్యాసాలు, ఎస్‌సీహెచ్‌బిబీఆర్‌ఎం విద్యార్థుల మాల్కంపోల్‌ విన్యాసాలు అలరించాయి. తణుకు రూట్స్‌ ప్రైవేట్‌ పాఠశాల విద్యార్ధినుల రింగ్‌లతో నృత్యాలను ఆకట్టుకున్నాయి. ముత్యా లపల్లి  జడ్పీ పాఠశాల విద్యార్థుల కోలాటం, నారాయణ పాఠశాల చిన్నా రుల నృత్యాలు, ఏఆర్‌కేఆర్‌, సెయింట్‌ మేరీస్‌, అంగన్‌వాడీ పాఠశాల చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఆరు గొలును  గురుకుల పాఠశాల విద్యార్ధులచే బ్యాగ్‌పేపర్‌ వా యిద్య విన్యాసాలు అలరించాయి. ఈ సంస్కృతి కార్యక్రమాల నిర్వాహణను డీఈవో  రమణ పర్యవేక్షించారు.
 
  ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు
భీమవరం, ఆగస్టు 15 : స్వాతంత్య్ర వేడుకలలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు, జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి చేతుల మీదుగా ఉత్తమ సేవలుఉ అందించిన అధికా రులకు పురస్కారాలను అందజేశారు.  వీరిలో జిల్లా అధికారులు.. కె.కృష్ణవేణి (డిస్ట్రిక్‌ రెవెన్యూ ఆఫీసర్‌), సి.విష్ణుచరణ్‌ (ఐఏఎస్‌ సబ్‌ కలెక్టర్‌ నరసాపురం), దాసి రాజు (రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌, భీమవరం), జెడ్‌.వెంకటేశ్వరరావు (డిస్ట్రిక్‌ అగ్రికల్చర్‌ ఆఫీసర్‌), కె.మురళీకృష్ణ (డిస్ట్రిక్‌ యానిమల్‌ హస్పెండరీ ఆఫీసర్‌), జీవీఆర్‌కేఎస్‌ గణపతిరావు (డిస్ట్రిక్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌), కె.శ్రీనివాసరావు (చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌), టి.శివరామ ప్రసాద్‌ (డీఎం, సివిల్‌ సప్లై ఆఫీసర్‌), ఎస్‌. సరోజ  (డిస్ట్రిక్‌  సప్లై ఆఫీసర్‌), ఎ.అంబేడ్కర్‌ (డిస్ట్రిక్‌ ఆడిట్‌ ఆఫీసర్‌), ఎం.రవికుమార్‌ (డిస్ట్రిక్‌ కోపరేటివ్‌ ఆఫీసర్‌), బి.భానునాయక్‌ (అడిషనల్‌ డీఎంహెచ్‌వో), దేవసుధ (డిస్ట్రిక్‌ ఎవ్వినైజేషన్‌ ఆఫీసర్‌), ఎం.నాగలత (డిస్ట్రిక్‌ పంచాయతీ ఆఫీసర్‌), ఎంఎస్‌ఎస్‌ వేణుగోపాల్‌ (పీడీ, డీఆర్‌డిఏ), ఎస్టీవీ రాజేశ్వరరావు (పీడీ, డీడబ్ల్యుఎంఏ), ఆర్‌.వెంకటరమణ (డిస్ట్రిక్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌), బి.శ్రీనివాసరావు (డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్‌), కేవీఎస్‌ నాగలింగచార్యులు (డిస్ట్రిక్‌ ఫిషరీస్‌ ఆఫీసర్‌), ఎన్‌.రమేష్‌బాబు (డిస్ట్రిక్‌ పుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌), వి.ఆదిశేషు (డిస్ట్రిక్‌ ఇండస్ట్రీస్‌ ఆఫీసర్‌), కె.అప్పారావు (డిస్ట్రిక్‌ హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్ట్స్‌ల్స్‌ ఆఫీసర్‌), ఎ.దుర్గేష్‌ (డిస్ట్రిక్‌ హర్టీకల్చర్‌ ఆఫీసర్‌), బి.సుజాత రాణి (డిస్ట్రిక్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫీసర్‌), ఏవీ రామరాజు (డిస్ట్రిక్‌ హౌసింగ్‌ హెడ్‌), డి.నాగార్జున (డీఐపీఆర్వో), పి.సుబ్రహ్మణ్యకుమార్‌ (డిస్ట్రిక్‌ అగ్రి ట్రేడ్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌), ఎస్‌.లోకేశ్వరరావు (డిస్ట్రిక్‌ ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ ఆఫీసర్‌), ఏఎస్‌ఏ రామస్వామి (డిస్ట్రిక్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ ఆఫీ సర్‌), కె.శోభారాణి (డిస్ట్రిక్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫీసర్‌), కె.జాషువా (డిస్ట్రిక్‌ సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఆఫీసర్‌), పి.ఉమామహేశ్వరరావు (డిస్ట్రిక్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ ఆఫీసర్‌), ఎ.గణేష్‌ (డిస్ట్రిక్‌ ట్రెజరీ ఆఫీసర్‌), డి.పుష్పరాణి (డిస్ట్రిక్‌ ఎస్టీ వెల్ఫేర్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫీసర్‌), పి.నాగార్జునరావు (డిస్ట్రిక్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌), పి.సురేంద్రబాబు (డిస్ట్రిక్‌ స్ఫోర్ట్స్‌ అథారిటీ ఆఫీసర్‌), కేఎస్‌ఎస్‌ శ్రీనివాసరావు (డిస్ట్రిక్‌ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఆఫీసర్‌), వై.శ్రీలత (డీపీఈవో, ఎక్సైజ్‌), ఏటీవీ రవికుమార్‌ ఏఎస్పీ స్పెషల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, ఎ.రామ్మోహనరావు లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, వీరితో పాటు మొత్తం మీద 241 మందికి ప్రశంసా పత్రాలు అందించారు.
 
ప్రజలకు బాధ్యతగా సేవ చేయాలి..
భీమవరం/భీమవరం క్రైం, ఆగస్టు 15 : నూత న జిల్లాలో చిన్న చిన్న సమస్యలను అధిగమించుకుంటూ మరింత బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సో మవారం 76వ స్వా తంత్య్ర వేడుకల  సందర్భంగా కార్యాలయ ఆవ రణలో కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్‌ జాతీయ జెండాను ఎగురవేసి పోలీస్‌ సిబ్బంది, అధికారులకు, జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఇన్‌చార్జి జేసీ కె.కృష్ణవేణి, ఆర్డీవో దాసిరాజు, ఏవో దుర్గాకిషోర్‌, జిల్లా కలెక్టరేట్‌లోని వివిధ కార్యాలయ సిబ్బంది,  ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

సమరయోధుల కుటుంబ సభ్యులకు సత్కారం

 జిల్లాలో ఎంపిక చేసిన  14 మంది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను మంత్రి దాడిశెట్టి రాజా, కలెక్టర్‌ ప్రశాంతి, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అసలు సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. స్వాతం త్య్రం కోసం వారి కుటుం బ పెద్దలు చేసిన పోరాటం చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు.

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
భీమవరం టౌన్‌, ఆగస్టు 15 : స్వాతంత్య్ర వేడుకల సంద ర్భంగా సోమవారం పరెడ్‌లో వివిధ శాఖల ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ శకటాలకు బహుమతులను ఆర్డీవో దాసిరాజు ప్రకటించారు. మొదటి బహుమతి జగనన్న గోరు ముద్దకు, ద్వితీయ బహుమతి పశుసంవర్థక శాఖకు, మూడో బహుమతి వ్యవసాయశాఖకు లభించాయి. నీటి యజమాన్యంపై డ్వామా ఆధ్వర్యంలో నిర్వహించిన శకటానికి ప్రత్యేక బహుమతిని అందించారు.



Updated Date - 2022-08-16T05:36:21+05:30 IST