బిల్లుల దందా!

ABN , First Publish Date - 2022-05-21T06:22:12+05:30 IST

జగనన్న కాలనీ లేఅవుట్‌లను మెరక చేసేందుకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

బిల్లుల దందా!
తాడేపల్లిగూడెంలో మెరక చేసిన విమానాశ్రయ భూమి

జగనన్న కాలనీల్లో పూడిక పేరిట దోపిడీ
ఉచితంగా మట్టి, ఇసుక లభ్యం
వాటికీ బిల్లులు పెడుతున్న కాంట్రాక్టర్లు
అధికార పార్టీ నేతల ఆశీస్సులు
కాలనీల పేరుతో అక్రమ వ్యాపారం
పట్టని అధికారగణం.. ప్రజాధనం వృథా


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జగనన్న కాలనీ లేఅవుట్‌లను మెరక చేసేందుకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉచితంగా లభ్య మవుతున్న మట్టి, బొండు ఇసుకకు బిల్లులు చేసుకుం టున్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే దందా సాగుతోంది. అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేసే అధికారులు జగనన్న లేఅవుట్‌ల పూడికపై జరుగు తున్న అవినీతి దందాపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఫలితంగా  కోట్లాది రూపాయల ధనం దుర్వినియోగ ువుతోంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో  జగనన్న లేఅవుట్‌లను మెరక చేస్తున్నారు. ఇప్పటికీ పూడిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. బిల్లులు పెడుతూనే ఉన్నారు. డెల్టా ప్రాంతంలో మట్టితో పూడిక చేస్తే ఇంటి నిర్మాణానికి అనువుగా ఉండదన్న ఉద్దేశంతో బొండు ఇసుకను విని యోగిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో మట్టి లేదా కంకరమట్టితో పూడుస్తున్నారు.  లేఅవుట్‌లకు మెరక చేసేందుకు వినియోగించే మట్టిని ఉచితంగానే పొందు తు న్నారు. గోదావరి తీరంలో లభ్యమయ్యే బొండు ఇసుకను ఉచితంగానే వినియో గించుకోవచ్చని ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. అయినా రవాణా చార్జీలతో పాటు, మట్టి కొనుగోలు చేసినట్టు బిల్లులు రూపొందిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. లేఅవుట్‌ల మెరక కోసం మెట్ట ప్రాంతంలో ఉన్న తాడిపూడి కాల్వ, ఎర్రకాల్వ గట్లను గుల్ల చేసేశారు. ఏలూరు నియోజక వర్గ పరిధిలో నీటి పారుదల శాఖ తాడిపూడి కాల్వ మట్టి తవ్వకానికి యూనిట్‌ ధరను నిర్ణయించి సొమ్ములు వసూలు చేసింది. అదే పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాప్రతినిధుల దందా సాగింది.  జగనన్న కాలనీల్లో ఎకరానికి రూ.లక్షల్లోనే బిల్లులు పెట్టేశారు. కనిష్ఠంగా రూ. 8 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.12 లక్షల వరకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తోంది. మెరక చేసే కాంట్రాక్టర్‌లతో పాటు, కమీషన్‌ల పేరుతో కొందరు అధి కార పార్టీ  ప్రజా ప్రతినిధులు సొమ్ము చేసుకుం టున్నారు. బినామీ కాంట్రాక్టర్‌లను ఉపయోగిస్తూ దందా సాగిస్తున్నారు. జిల్లాలోని 4.66 ఎకరాల విస్తీర్ణం ఉండే ఓ లేఅవుట్‌ మెరక కోసం రూ.1.25 కోట్లు బిల్లు పెట్టారు. అంటే ఒక్కో ఎకరానికి దాదా పు రూ.25 లక్షలు వెచ్చించారన్నమాట. జిల్లా అధికారులు ఆ లేఅవుట్‌ను ఇటీవల సందర్శించా రు. బొండు ఇసుకతో పూడ్చినట్టు గుర్తించారు. రవాణా వ్యయంతోనే బిల్లు చేయాల్సిన అధికారులు ఇసుకకు బిల్లు చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు. జగనన్న లేఅవుట్‌ల మెరక చేసినప్పటి నుంచి ఇదే దందా సాగుతోంది. మట్టి, ఇసుక కొనుగోలు చేస్తున్నట్టు బిల్లులు చేసుకుంటున్నారు. సిద్ధాంతం, కోడేరు, కరుగోరు మిల్లి, యలమంచిలి, పోడూరు, నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల నుంచి బొండు ఇసుకను తరలిస్తున్నారు. గతంలో బొండు ఇసుక తరలించా లంటే కష్ట తరమయ్యేది. నిబంధనలు కఠినతరంగా అమలు చేసేవారు. జగనన్న కాలనీలు తెరపైకి వచ్చిన తర్వాత బొండు ఇసుక విచ్చలవిడిగా తరలిస్తున్నారు. ఉచి తంగా లభ్యమవుతున్నా బిల్లులు చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

కాలనీల పేరుతో వ్యాపారం
 జగనన్న కాలనీల పేరుతో మట్టి, బొండు ఇసుక అక్రమ రవాణా  జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ భూములు మెరక చేసేందుకు తరలి స్తున్నారు. జిల్లాలో ఇది పెద్ద వ్యాపారంగా మారింది. ఇతర జిల్లాలకు తరలి వెళుతోంది. వైసీపీ నేతల ఆశీస్సులు ఉండడంతో అధికారులు పెద్దగా పట్టించు కోవడం లేదు. ఎమ్మెల్యేల ఆశీస్సులతో పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయి. స్థానిక రహదారులు అభివృద్ధి కోసమంటూ పంచాయతీలు తీర్మానం చేస్తున్నా గ్రామాల్లో మాత్రం రహదారులు వేయడం లేదు. సదరు మట్టిని ఇతర అవసరాలకు తరలిస్తున్నారు. పేరు గ్రామాలది. పెత్తనమంతా అక్రమ వ్యాపా రులే నిర్వహిస్తున్నారు. వీరిలో అధికార పార్టీ నేతలు లేదంటే ఆ పార్టీ సానుభూతి పరులైన కాంట్రాక్టర్‌లే ఉంటున్నారు. మొత్తంగా జగనన్న కాలనీల్లో ఉచిత మట్టి, ఇసుక దందా ఒక ఎత్తయితే కాలనీల పేరుతో అక్రమ వ్యాపారం మరోవైపు యథేచ్ఛగా  సాగుతోంది.  

  నీళ్లు వెళ్లేలా చూడండి: కలెక్టర్‌ ప్రశాంతి
 అత్తిలి/ తణుకు, మే 20 : అత్తిలి మండలం బొంతువారిపాలెం పెద్దపేట జగనన్న ఇళ్ల కాలనీ లేఅవుట్‌ను శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించారు. అనుకుంత మేర ఈ లేఅవుట్‌ను మట్టితో పూడ్చలేదు. దీంతో రోడ్డుకు పల్లంలో ఉన్నందున  మురుగు నీరు, వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారుల బిల్లు లు సొమ్ము త్వరితగతిన అందించాలని ఆదేశించారు. ఇళ్ల ప్రగతిపై సమీక్షించారు. అనంతరం ఇటీవల కురిసిన వర్షాలకు తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు.  తణుకు పరిధిలోని పైడిపర్రు, అజ్జరం, ఆర్టీవో కార్యాలయం రోడ్డు, ఇరగవరం రోడ్డులోని లేఅవుట్లను, జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను శుక్ర వారం కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇళ్ల నిర్మాణా లను,  మౌలిక సదుపాయాలు కల్పన పనులు వేగవంతం చేయాలన్నా రు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. 90 రోజుల్లో ఇళ్ల స్థలాల మంజూరుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.  ఆమె వెంట తణుకు తహసీల్దార్‌ ప్రసాదు, కమిషనర్‌ సృజన, ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, అత్తిలి ఇన్‌చార్జి తహసీల్దార్‌ మురళి, ఎంపీడీవో వీరాస్వామి, గృహ నిర్మాణ శాఖా అధికారులు ఉన్నారు. 



Updated Date - 2022-05-21T06:22:12+05:30 IST