భూములపై పెద్దల కన్ను

ABN , First Publish Date - 2021-04-21T05:38:35+05:30 IST

వల్లంపట్ల పంచాయతీ శివా రు సింగరాయపాలెంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.

భూములపై పెద్దల కన్ను

సింగరాయపాలెంలో కాజేసే ప్రయత్నం

మధ్యవర్తులతో అధికారులపై ఒత్తిడి

టి.నరసాపురం, ఏప్రిల్‌ 20 : వల్లంపట్ల పంచాయతీ శివా రు సింగరాయపాలెంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. సర్వే నెం.40లో 3.39 ఎకరాలు ప్రభుత్వ భూముల్లో గయాలగా నమోదైంది. కాగా ఆ భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల రెవెన్యూ అధికా రులు అందులో 50 సెంట్ల భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించారు. మిగిలిన 2.90 ఎకరాలను ఆన్‌లైన్‌ చేయిం చుకుని భూమిని కబ్జా చేసేందుకు ఆ భూస్వామి మధ్య వర్తుల ప్రమేయంతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమా చారం. గతంలోనే ఫోర్జరీ డాక్యుమెంట్‌లను సృష్టించి పాస్‌ బుక్‌ సృష్టించినట్టు సమాచారం. ఇందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. తాజా గా ఆ భూమి వివరాలను ఆన్‌లైన్‌ చేయించేందుకు మ్యూ టేషన్‌కు దరఖాస్తు పెట్టినట్టు తెలిసింది. గ్రామానికి సమీ పాన ప్రజల అవసరార్థం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల కు అనువుగా ఉండే ఆ భూమిని పెద్దల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని వెంటనే అధికారు లు స్పందించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని పలు వురు డిమాండ్‌ చేస్తున్నారు. 

దరఖాస్తు వచ్చింది.. పరిశీలించాలి

‘సింగరాయిపాలెంలో సర్వే నెం.40లో 3.39 ఎకరాల గయాల భూమి ఉంది. ఆ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం  50 సెంట్ల భూమిలో లే అవుట్‌లు వేస్తున్నాం. మిగి లిన భూమికి ఆన్‌లైన్‌ చేయాల్సిందిగా మ్యూటేషన్‌ కోసం శ్యామల సత్యనారాయణ రెడ్డి (సత్తిరెడ్డి) అనే వ్యక్తి దర ఖాస్తు చేసుకున్నారు. దీనిని పరిశీలించాల్సి ఉంది.’ అని టి.నరసాపురం తహసీల్దార్‌ కె.నవీన్‌కుమార్‌ తెలిపారు.  

Updated Date - 2021-04-21T05:38:35+05:30 IST