బాలారిష్టాలు!

ABN , First Publish Date - 2022-05-24T06:16:39+05:30 IST

కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధి కోసం చేపడుతున్న నాడు–నేడు పథకం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది.

బాలారిష్టాలు!

నాడు–నేడు పనుల కోసం ప్రజాప్రతినిధుల జోక్యం
తమ వారికే పనులు కేటాయించేలా ఒత్తిళ్లు
తల్లిదండ్రుల కమిటీ, హెచ్‌ఎంలతోనే  నిర్వహించేందుకు అధికారులు కసరత్తు
సిమెంట్‌, ఐరన్‌ సరఫరాలోనూ జాప్యం
ముఖం చాటేస్తున్న మొదటి విడత కాంట్రాక్టర్లు


(భీమవరం–ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధి కోసం చేపడుతున్న నాడు–నేడు పథకం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. పథకం లో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు జిల్లా అధికారులు కుస్తీ పడుతున్నారు. నిబంధనల మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ, ప్రధా నోపాధ్యాయుల నేతృత్వంలోనే పనులు చేయాలని కలెక్టర్‌ సంకల్పిం చారు. క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ రంగు పడుతోంది. ప్రజా ప్రతినిధులు తమ వారికి పనులు కట్టబెట్టేందుకు అవస్థలు పడుతున్నారు. కొన్ని మండ లాల్లో పేరుకే తల్లిదండ్రుల కమిటీలు ఉంటున్నాయి. కాంట్రా క్టర్లే పనులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసు కున్నారు. అయితే నాడు–నేడు మొదటి విడత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొం దరు కాంట్రాక్టర్లు, కార్యకర్తలు పాఠశాలల పనులంటేనే ఆమడదూరం పరు గులు తీస్తున్నారు. ప్రజాప్రతినిధులు మాత్రం కొత్తవారిని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులపై ఇప్పటికే ఒత్తిడి పెరిగింది.

 కానరాని సిమెంట్‌, ఐరన్‌
ఇప్పటికే నాడు–నేడులో మండలాల వారీగా చేపట్టాల్సిన పనులపై ప్రతి పాదనలు సిద్ధం చేసి అంచనాలు రూపొందించారు. అందుకు అవసరమైన సిమెంట్‌, ఐరన్‌ లెక్కలు కట్టారు. వాస్తవానికి 10 లారీలు సిమెంట్‌, ఐరన్‌ అవసరమనుకుంటే రెండు లారీలకే మొదటి విడతగా ఇండెంట్‌ పెట్టారు.  రోజులు గడచిపోతున్నా సామగ్రి మండలాలకు చేరుకోలేదు. మరోవైపు జిల్లా అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. సిమెంట్‌, ఐరన్‌ వంటి సామగ్రిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలోనే  ఏజన్సీలను ఖరారు చేసింది. వారికే  బిల్లులను జమ చేయనుంది. ఇతర అవసరమైన పరికరాలకు కేంద్రీకృత కాంట్రాక్టర్‌లను నియమిస్తోంది. దాంతో ప్రజాప్రతినిఽ దులు పట్టుబడుతున్నా సరే జిల్లాలోని పలు మండలాల్లో పనులు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు, కాంట్రా క్టర్లు ముందుకు రావడం లేదు. వచ్చిన చోట సరుకు కొరతతో పనులు సాగడం లేదు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. కూలీలు వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి బాలారి ష్టాలతో  అధికారులు సతమతమవుతున్నారు.

 శాఖల వారీగా పనులు కేటాయింపు
జిల్లాలో 382 పాఠశాలలో ఈ ఏడాది నాడు–నేడు పనులు పూర్తి చేయా ల్సి ఉంటుంది. మరో 83 పాఠశాలలకు అదనపు తరగతి గదులను నిర్మిం చాలి. మొదటి విడతలో నాడు–నేడు పూర్తయిన పాఠశాలల్లో ఈఏడాది అదనపు తరగతి గదులు మాత్రమే నిర్మించాలి. అలాకాకుండా మరల పూర్తిస్థాయిలో పాఠశాలను అభివృద్ధి చేసేలా ఆదేశాలు జారీ చేశారు. అటువంటి పాఠశాలల్లో అభివృద్ధికి అవకాశం లేదంటూ అధికారులు ప్రతి పాదనలను తిప్పి పంపుతున్నారు. నాడు–నేడు పనులను చేపట్టే బాధ్యత లను వివిధ శాఖలకు అప్పగించారు. జిల్లాలో సమగ్ర శిక్ష 79 పాఠశాలలు, పంచాయతీరాజ్‌ 172, పబ్లిక్‌ హెల్త్‌ 72, ఏపీఈడబ్ల్యూఐడీసీ 11, గ్రామీణ నీటిపారుదల శాఖ 48 పాఠశాలలను అభివృద్ధి చేయనుంది. ప్రభుత్వమే సిమెంట్‌, ఐరన్‌, ఇసుక సరఫరా చేయాల్సి ఉంటుంది. ఏజన్సీలకు సొమ్ము లు విడుదల చేయాలి. ఇప్పటివరకు ఇండెంట్‌లు పెట్టినా సరఫరా లేదు.  

 చేపట్టే పనులు ఇవే..
నాడు–నేడులో 10 రకాల పనులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు, ఉపా ధ్యాయులకు కుర్చీలు, బెంచీలు. తాగునీటి సౌకర్యం, ఇంగ్లీష్‌ ల్యాబ్‌, కిచెన్‌ షెడ్‌, పాఠశాలలో విద్యుతీకరణ, గ్రీన్‌ చాక్‌ బోర్డులు ఏర్పాటు. మరుగుదొడ్లు నిర్మాణం, ప్రహరీల నిర్మాణం వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పాఠశాలల్లో పెయింటింగ్‌లు వేయాలి.  నాడు–నేడుకు ఎంపికైన ప్రతి పాఠశాలలో 10 రకాల పనులు విధిగా పూర్తి చేయాలి. మరో 83 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేయాలంటే ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేయాలి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మొదటి విడత నాడు–నేడు పథకం నత్తనకడన సాగింది. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయా శాఖలు పడరాని పాట్లు పడ్డాయి. ఈసారైనా బిల్లులు సక్రమంగా చెల్లిస్తే పనులు పూర్తిస్థాయిలో చేసేందుకు అవకాశం ఉంటుంది. జిల్లా అధికారుల లక్ష్యం నెరవేరుతుంది. కానీ సామగ్రి సరఫరాలోనే జాప్యం జరుగుతోంది.

Updated Date - 2022-05-24T06:16:39+05:30 IST