జయహో..

ABN , First Publish Date - 2022-08-09T06:05:50+05:30 IST

తాడేపల్లిగూడెంలో ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సోమవారం 750 అడు గుల జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు.

జయహో..
జాతీయ జెండాతో తాడేపల్లిగూడెంలో ర్యాలీ..

తాడేపల్లిగూడెంలో 750 అడుగుల జాతీయ జెండాతో
హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 8 : తాడేపల్లిగూడెంలో ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సోమవారం 750 అడు గుల జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్వీఆర్‌ సర్కిల్‌ నుంచి పోలీస్‌ ఐలాండ్‌ సెంటర్‌ వరకూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవ దాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా జాతి సమైక్యత కోసం పాటుపడడమే మన బలమన్నారు. కలెక్టర్‌ ప్రశాంతి, ఆర్డీవో దాసి రాజు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, తహసీ ల్దార్‌ అప్పారావు, ఎంపీడీవో మల్లికార్జున రావు, కమిషనర్‌ బాల స్వామి, ఎంఈవో వి.హను మ, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.


స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి  : కలెక్టర్‌
భీమవరం, ఆగస్టు 8: స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. వివిధ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శకటాలు, స్టాల్స్‌ ఏర్పాట్లను సంబంధిత అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వేదిక, బారికేడింగ్‌ ఏర్పాట్లను ఆర్‌అండ్‌బీ అధికారులు, తాగునీరు ఆర్‌డబ్ల్యూఎస్‌, శానిటేషన్‌ ఏర్పాట్లను మునిసిపల్‌శాఖ చేపట్టాలన్నారు. వేడుకలు జరుగుతున్న సమయంలో జిల్లా అంతటా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. స్టాల్స్‌ ఏర్పాటులో ప్రధానంగా మన జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకున్న లేసు అల్లికలను ప్రదర్శించాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.కృష్ణవేణి, నరసాపురం సబ్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌, భీమవరం ఆర్డీవో దాసి రాజు, హౌసింగ్‌ పీడీ రామరాజు, ఆర్‌అండ్‌బీ డీఈ లోకేశ్వర్‌, డీఈవో ఆర్‌వీ రమణ, జిల్లా హర్టికల్చర్‌ అధికారి దుర్గేష్‌, డ్వామా పీడీ ఎస్‌టీవీ రాజేశ్వరరావు, భీమవరం తహసీల్దార్‌ వై.రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T06:05:50+05:30 IST