నిబంధనల ఊసే లేదు..!

ABN , First Publish Date - 2021-05-09T05:16:35+05:30 IST

కర్ఫ్యూ నిబంధనల వల్ల ప్రజలు తమ అవస రాలు తీర్చుకోవడానికి తొందర పడుతున్నారు.

నిబంధనల ఊసే లేదు..!
ఆర్‌ఆర్‌పేటలో రద్దీ

కొవిడ్‌ నిబంధనలు పాటించని జనం 

గుంపులుగా రోడ్లపైకి వస్తున్న వైనం 

 వెంటాడుతున్న కర్ఫ్యూ భయం

ఏలూరు ఫైర్‌స్టేషన్‌,  మే 8 : కర్ఫ్యూ నిబంధనల వల్ల ప్రజలు తమ అవస రాలు తీర్చుకోవడానికి తొందర పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే ప్రభుత్వం సమయం ఇవ్వడంతో ఈ సమయంలోనే వారి పనులు పూర్తి చేసుకోవడానికి కొవిడ్‌ నిబంధనలు సైతం మర్చిపోతున్నారు. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పాల ప్యాకెట్లు తీసుకునే సమయం నుంచి కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఇతర అవస రాలు తీసుకోవడానికి ప్రజలు ఒకేసారిగా రోడ్లపైకి వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే మరలా పోలీసులతో ఎక్కడ లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుందోననే అతృతతో ముగింపు సమయంలో మరీ ఎక్కువగా ప్రజలు గుంపులు గుంపులుగా చేరిపోతున్నారు. దీంతో  వైరస్‌ ఎక్కువ అవుతుందనే ఆందోళన ప్రజల్లో నెలకొని ఉంది. వ్యాపారులు కూడా 12 గంటలు తర్వాత మూసివేయాల్సి రావడంతో కొవిడ్‌ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. మాస్క్‌లు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించ కుండా ఎవరి పనులు వారు చేసుకుపోతున్నారు. చాలామందిలో నిర్లక్ష్య ధోరణి కనిపి స్తోంది. మనకు కొవిడ్‌ రాదులే అనే ఒక అలక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఒక్కసారికి గుంపులో వెళ్లితే ఏం కాదులే అనే ఆలోచనతో పనులు ముగించుకుంటున్నారు. 12 గంటల అనంతరం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తే కాని కరోనాకు చెక్‌ పెట్టడం కష్టమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 


 పెదపాడు మండలంలో 16 పాజిటివ్‌ కేసులు

పెదపాడు, మే 8 : పెదపాడు మండలంలో శనివారం 16 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పెదపాడు పీహెచ్‌సీలో వసంతవాడ 2, వీరమ్మకుంట 2, నాయుడుగూడెం ఒకటి, వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో వట్లూరు 3, కొక్కిరపాడు 2, అప్పనవీడులో 6 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసులకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహి స్తున్నట్టు వైద్యసిబ్బంది తెలిపారు. శనివారం వ్యాక్సినేషన్‌ ప్రకయ జరగలేదు.


పిల్లల  సంరక్షణకు ప్రత్యేక పునరావాస కేంద్రాలు

ఏలూరు క్రైం, మే 8: కరోనా వైరస్‌తో తల్లిదండ్రులు మరణిస్తే అనాధలుగా మారే పిల్లలను సంరక్షణ చేయడా నికి ప్రత్యేక పునరావాస కేం ద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజలకు ఈ విష యంపై అవగాహన కల్పించడానికి చైల్డ్‌లైన్‌ బ్రోచర్లను, ఫ్లెక్సీలను తయారు చేయిం చారు. వీటిని ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఆవరణలో శనివారం ఏర్పాటు చేశారు. డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌తో ఫెక్సీలు, వాల్‌పోస్టర్లను ఆవిష్కరణ చేయించారు. ఎవరైనా తల్లి దండ్రులు కరోనాతో మరణిస్తే ఆ పిల్లలు అనాధలు అయితే వారిని సంరక్షించడానికి ప్రత్యేక హోమ్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నర్సాపురంలోని రుస్తుంబాదలోని బెతస్ధ చిల్డ్రన్‌ హోమ్‌, తాడేపల్లిగూడెం రాచూరులో ఉన్న 3ఎఫ్‌ స్వాభిమాన్‌ ఫౌం డేషన్‌, కొవ్వూరులో ఉన్న మదర్‌ థెరిస్సా చిల్డ్రన్‌ హోమ్‌లో ఏర్పాటు చేశారన్నారు. టోల్‌  ఫ్రీ నెంబర్‌ 1098, 181కు సమాచారం అందించాలని కోరారు.  

Updated Date - 2021-05-09T05:16:35+05:30 IST