వారు చేయరు..వీరిని చేయనివ్వరు

ABN , First Publish Date - 2022-01-20T06:17:26+05:30 IST

మడుగు పోలవరం పం చాయతీలో రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.

వారు చేయరు..వీరిని చేయనివ్వరు
మడుగు పోలవరంలో నిర్మాణంలోనే నిలిచిన గ్రామ సచివాలయ భవనం

 కాంట్రాక్టర్‌ను తప్పించిన పాలకవర్గం

 మడుగు పోలవరంలో ముందుకు సాగని ఆర్‌బీకే, సచివాలయ నిర్మాణాలు

వీరవాసరం, జనవరి 19 : మడుగు పోలవరం పం చాయతీలో రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఆర్‌బీకే నిర్మాణానికి రూ.21 లక్షలు, సచివాలయ భవన నిర్మాణానికి రూ.45 లక్షలు కేటాయించారు. గ్రామానికి చెందిన వ్యక్తికే నిర్మాణ పనుల కాంట్రాక్టు అప్పగించారు. పనులు ప్రారంభమై ఒక దశకు వస్తున్న    తరుణంలో పంచాయతీ ఎన్నికలు జరిగి పాలకవర్గం మారింది. దీంతో పనులు చేస్తున్న కాంట్రాక్టరును తప్పించి పాలకవర్గ ప్రతినిధులే పనులు చేపట్టడానికి ప్రయత్నాలు చేశారు. నిర్మాణ స్థలంలో వున్న మెటీరియల్‌ను స్వాధీనం చేసుకోవడంతో కాంట్రాక్టరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టరు, ప్రతినిధుల మధ్య రాజీకి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఉపాధి హామీ నిధుల భాగస్వామ్యంతో చేపట్టిన నిర్మాణ పనుల్లో మొదటి దశగా రూ.24 లక్షలు పంచాయతీ ఖాతాలో జమయ్యాయి. ఈ మొత్తాన్ని కాంట్రాక్టరుకు ఇవ్వడంలోనూ వివాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో వేసిన సీసీ రహదారుల నిఽధులు పంచాయతీ ఖాతాకు చేరిన ప్పటికీ నిర్మాణం చేసిన వారికి చేరలేదని సమాచారం. ఈ నిధులు దుర్వినియోగమయ్యాయని రాజకీయ పెద్దల మధ్య పంచాయతీ ఏర్పాటుచేశారు. అయినప్పటికీ నిధుల వ్యవహారం, భవన నిర్మాణాల వివాద వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ఈ వివాదాల మధ్య భవనాల నిర్మాణం నత్తనడక నడుస్తున్నా అధికార యంత్రాంగం దృష్టి సారించకపోవడంపై  విమర్శలు వినిపిస్తున్నాయి.  

Updated Date - 2022-01-20T06:17:26+05:30 IST