ప్రజా రవాణా సంస్థ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-01-22T05:42:46+05:30 IST

నష్టాల్లోవున్న ప్రజా రవాణా సంస్థకు ఆదాయం పెంచే లక్ష్యంతో పనిచేస్తానని ప్రజా రవాణా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్‌ అన్నారు.

ప్రజా రవాణా సంస్థ అభివృద్ధికి కృషి
ఏలూరు ఆర్టీసీ డిపోలో టైర్లను పరిశీలిస్తున్న ఠాకూర్‌

ఏలూరు డిపో పరిశీలనలో ఎండీ ఆర్‌పీ ఠాకూర్‌ 

ఏలూరు కలెక్టరేట్‌, జనవరి 21: నష్టాల్లోవున్న ప్రజా రవాణా సంస్థకు ఆదాయం పెంచే లక్ష్యంతో పనిచేస్తానని ప్రజా రవాణా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్‌ అన్నారు. ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా గురువారం ఏలూరు ఆర్టీసీ గ్యారేజ్‌ను, కాంప్లెక్స్‌ను సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్యారేజీ ఆవ రణలో మొక్కను నాటి నీళ్లు పోశారు. తదుపరి పీటీడీ స్థలాల ను పరిశీలించి, ఆదాయం ఎంత వస్తుందో అడిగి తెలుసుకు న్నారు. అందరి సహకారంతో సంస్థను ఉన్నతస్థాయికి తీసుకు వెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇది మనందరి బాధ్యతని గుర్తుచేశారు. కిందిస్థాయి నుంచి కార్మికుల పైస్థాయి వరకూ అందరూ కష్టపడి పనిచేస్తున్నారన్న నమ్మకం తనకు ఉందన్నా రు. కొవిడ్‌ సమయంలో నష్టపోయిన సంస్థను నష్టాల ఊబి నుంచి 80 శాతం వరకూ పుంజుకునేలా చేశారని కొనియాడా రు. ఏ సమస్య వచ్చినా తనను కలవవచ్చునన్నారు. ఈడీ  వో బ్రహ్మానందరెడ్డి, విజయవాడ జోన్‌ ఈడీ గిడుగు వెంకటేశ్వర రావు, ఇన్‌ఛార్జి ఆర్‌ఎం ఎం.శ్రీనివాసరావు, డిప్యూటీ సీటీఎం ఎస్‌కె షబ్మం, డిపో మేనేజర్‌ సీహెచ్‌ సునీత, సీఐ ఉదయ్‌ చక్ర వర్తి, సూపర్‌వైజర్లు, కార్మిక సంఘాల నాయకులు, పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-22T05:42:46+05:30 IST