క్వార్టర్స్‌.. శిథిలం

ABN , First Publish Date - 2022-01-22T05:11:02+05:30 IST

స్థానికంగా నివాసముంటూ 24 గంటలు వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉండాల్సిన వైద్యసిబ్బందికి శిథిలావస్థకు చేరుకున్న నివాస క్వార్టర్స్‌ నిరాశే కలిగిస్తున్నాయి.

క్వార్టర్స్‌.. శిథిలం

పెదపాడు పీహెచ్‌సీలో నీరుగారుతున్న 24 గంటల వైద్యం
క్వార్టర్స్‌ పునః నిర్మించాలంటూ సిబ్బంది విన్నపం


పెదపాడు, జనవరి 21 : స్థానికంగా నివాసముంటూ 24 గంటలు వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉండాల్సిన వైద్యసిబ్బందికి శిథిలావస్థకు చేరుకున్న నివాస క్వార్టర్స్‌ నిరాశే కలిగిస్తున్నాయి. దీంతో వైద్యసిబ్బంది పూర్తి స్థాయిలో స్థానికంగా నివాసం ఉండడం లేదు. ఈ కారణంగా అత్యవసర సమ యంలో రోగులకు వైద్య సేవలు సత్వరం అందడం లేదన్న వ్యాఖ్యలు విన్పి స్తున్నాయి. క్వార్టర్స్‌ పునఃనిర్మించాలని సిబ్బంది కోరుతున్నారు.
మండల కేంద్రం పెదపాడు ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో 11 సబ్‌ సెం టర్లు ఉన్నాయి. పీహెచ్‌సీలో నిత్యం అవుట్‌ పేషెంట్లు 100 నుంచి 120 మందికి వైద్యసేవలందిస్తుంటారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు, పాము కాటుతో పాటుగా ఇతరత్రా అత్యవసర వైద్యసేవల కోసం పెదపాడు పీహెచ్‌సీకి పరుగులు పెడతారు. సిబ్బంది నివాసముండాల్సిన క్వార్టర్లు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న అరకొర వైద్యసిబ్బంది మాత్రమే ఆస్పత్రిలోనే కార్యాలయ గదుల్లోనే నిద్ర పోతూ అత్యవసర చికిత్సకై వచ్చే వారికి వైద్యసేవలందిస్తున్నారు. పీహెచ్‌సీలో 24 గంట లూ పూర్తిస్థాయిలో వైద్యసేవలందించాలంటే వైద్యులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో మౌలిక వసతులతో కూడిన క్వార్టర్స్‌ అందుబాటులోకి తీసుకురావా లని ఎంతోకాలంగా సిబ్బంది మొరపెట్టుకుంటున్నారు. అంతేకాక క్వార్టర్స్‌తో పాటుగా పక్కనే పూర్తిస్థాయిలో పాడుబడిన సిబ్బంది శిక్షణ కేంద్రంలో పాము లు, విషపురుగులు చేరి అప్పుడప్పుడూ ఆస్పత్రిలోకి ప్రవేశిస్తుండటంతో భయ పడుతూ విధులు నిర్వహించాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరుకోవడంతో పూర్తిస్థాయిలో వైద్యసిబ్బంది స్థానికంగా నివాస ముండకపోవడంతో 24 గంటల వైద్యసేవల లక్ష్యం నీరుగారిపోతోందని, ఇకనైనా సంబంధిత అధికారులు శిథిలావస్థకు చేరిన క్వార్టర్స్‌ను పూర్తిస్థాయిలో తొల గించి తిరిగి నివాసయోగ్యమైన భవనాలను నిర్మించాలని కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం
వైద్యసిబ్బంది నివాసముండే క్వార్టర్స్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో తిరిగి పునః నిర్మించాలంటూ ఉన్నతాధి కారులకు పలుమార్లు నివేదికలు పంపాం. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.
– చక్రధర్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి, పెదపాడు

Updated Date - 2022-01-22T05:11:02+05:30 IST