రేషన్‌ డీలర్లకు వృత్తి, ఆర్థిక భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2021-01-22T05:37:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ డీలర్లకు వృత్తి, ఆర్థిక భద్రత కల్పించాలని రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివిలీలా మాధవరావు డిమాండ్‌ చేశారు.

రేషన్‌ డీలర్లకు వృత్తి, ఆర్థిక భద్రత కల్పించాలి

 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు

జంగారెడ్డిగూడెం, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ డీలర్లకు వృత్తి, ఆర్థిక భద్రత కల్పించాలని రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివిలీలా మాధవరావు డిమాండ్‌ చేశారు. గురువారం  లయన్స్‌ క్లబ్‌ భవనంలో రేషన్‌ డీలర్ల డివిజన్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లా డుతూ కొన్ని సంవత్సరాలుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్లుగా భాగస్థుల మయ్యామని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న 29వేల మంది డీలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ప్రభుత్వం డీలర్లను తొలగించాలనే ఉద్దేశం లేదని స్టాకిస్టులుగా ఉంచుతామని చెబుతు న్నారు కానీ అందుకు తగిన ఆర్డర్‌ గానీ, జీవోగానీ విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో కరోన కారణంగా మృతిచెందిన సుమారు 54 మంది డీలర్లను ఫ్రంట్‌ వారియర్‌లుగా గుర్తించి రూ.25లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం కోశాధికారి రాజుల పాటి గంగాధర్‌ గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి నరసింహారావు, జంగారెడ్డిగూడెం డివిజన్‌ అధ్యక్షుడు పఠాన్‌ బాషా, మండల అధ్యక్షుడు కంచర్ల రమేశ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-22T05:37:00+05:30 IST