మరో బాదుడు

ABN , First Publish Date - 2022-05-22T05:52:44+05:30 IST

మరో బాదుడుకు ప్రభుత్వం సిద్ధ పడుతోంది.

మరో బాదుడు

నిర్మాణాలపై 10 శాతం రిజిస్ర్టేషన్‌ విలువ పెంపు
భీమవరం పట్టణానికి డబుల్‌ డోస్‌
గతంలోనే భూముల ధరల పెంపు
జూన్‌ ఒకటో తేదీనుంచి అమలులోకి రానున్న నిర్మాణ ధరలు
అధికారికంగా అందని సమాచారం


ఆదాయం పెంచుకునేందుకు ప్రభు త్వం పన్నులు, చార్జీలు పెంచుతూ ఎడా పెడా వాయిస్తోంది. మొన్నటికి మొన్న నవీన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆస్తుల రిజి స్ర్టేషన్‌ విలువను పెంచింది. ఇప్పుడు జిల్లాలోని అన్ని పట్టణాలు, పల్లెల్లో నిర్మాణాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పెంపు దలను  గోప్యంగా ఉంచింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి అమలు  చేయ నుంది. అధికారికంగా ఇంకా వెల్లడిం లేదు. ఈ నిర్ణయం రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయంపై తీవ్ర చూపే అవకాశం ఉంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)
మరో బాదుడుకు ప్రభుత్వం సిద్ధ పడుతోంది. ప్రజల జేబులను ఖాళీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జిల్లా లోని అన్ని పట్టణాలు, పల్లెల్లో నిర్మాణాల ధరలను పెంచేలా చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరిలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ప్రతిపాదించిన ఈ ధరలు కేవలం పట్టణాలకు పరిమితం చేశారు. అప్పట్లో పెద్ద మొత్తంలోనే ధరలను పెంచింది. పట్టణాల్లో రెండు అంతస్తుల వరకు  ఒక్కో చదరపు అడుగు రిజిస్ర్టేషన్‌ ధర రూ.1200లుగా నిర్ణ యం తీసుకుంది. మూడో అంతస్తు నుంచి రూ.1300, ఎత్త యిన నిర్మాణాలకు రూ.1320లుగా ధరను నిర్ధారించారు.  పల్లెల్లోనూ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్ర భుత్వం నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా ప్రతి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలోనూ ఆదాయం సమకూర్చాల్సి ఉంటుంది. అం దుకు తగ్గట్టుగానే ధరలను పెంచుతోంది.  తాజాగా మేజర్‌, మైనర్‌ పంచాయతీలకు పెంచిన ధరలను ప్రభుత్వం వర్తింప చేసింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి అమలు జరిగేలా ఉత్త ర్వులు సిద్ధం చేసింది. అధికారికంగా వాటిని  ఇంకా వెల్లడిం చలేదు. సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు ఇప్పటివరకు ఎటు వంటి సమాచారం లేదు. అనధికారికంగా మాత్రమే జిల్లా అధికా రులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఆధికారిక ఆదేశాలు అందిన వెంటనే ధరలను పెంచేందుకు అధికారు లు సిద్ధంగా ఉన్నారు.  నిర్మాణాలపై సగటున 10శాతం ధరలను పెంచుతూ ప్రభుత్వం ప్రతి పాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తం గా నిర్మాణాలకు ధరలు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి రాష్ట్ర స్థాయిలోనే పెంపు ప్రతిపాదనలు రూపకల్పన చేస్తారు. వాటిని అమలు చేయాల్సిందిగా జిల్లాలకు ఆదేశాలిస్తారు. అదే భూముల విలువ అయితే ప్రాంతాల వారీగా తేడా ఉంటుంది. ఒకే పట్టణం లేదా గ్రామంలో వేర్వేరు ధరలుంటాయి. బహిరంగ మార్కెట్‌ ధరను అంచనా వేసి రిజిస్ర్టేషన్‌ విలువ ను నిర్ణయిస్తారు. ఇళ్ల స్థలాలకు, వ్యవ సాయ భూములకు వేర్వేరుగా ధరలను నిర్ధారిస్తారు. సబ్‌రిజిస్ర్టార్‌ కార్యా లయాల పరిధిలోనే ప్రతిపాదనలు సిద్ధమవుతాయి. వాటిని ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అమ లులోకి వస్తాయి. నిర్మాణాలపై మాత్రం ప్రభుత్వమే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆదేశాలిస్తుంది. వాటిని అమలు చేసే బాధ్యత సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలపై ఉంటుంది.
 
భీమవరానికి డబుల్‌ డోస్‌
జిల్లా కేంద్రమైన భీమవరానికి రెండు దెబ్బలు తగిలాయి. జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించడంతో అప్పట్లో స్థానికం గా  సంబరాలు చేసుకున్నారు. అయితే వారం వ్యవధిలోనే
భీమవరంలో భూముల రిజిస్ర్టేషన్‌ ధరలను ప్రభుత్వం పెంచేసింది. సగటున 20శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా నిర్మాణాల పైనే ధరలను పెంచడంతో భీమవరం పట్టణ ప్రజలపై రెండు భారాలు పడుతున్నాయి. ఇప్పటికే క్రయ విక్రయాలు మందగించాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బతింది. కొద్దోగొప్పో నిర్మాణాలు జరుగుతున్నాయి. అదికూడా సొంత స్థాలాలపై వ్యక్తిగత ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అపార్ట్‌ మెంట్‌లకు పెద్దగా మోజు చూపడం లేదు.  ఇటవంటి తరుణంలో ప్రభుత్వం ధరలు పెంచడంపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్‌లలో ఆందోళన వ్యక్తమవుతోంది.

లక్ష్యం చేరుకుంటారా..
ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ర్టేషన్‌ శాఖకు భారీ లక్ష్యాలనే ఇచ్చింది. వాటిని చేరుకోవాలంటే కష్టతరంగా ఉందంటూ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో రిజిస్ర్టేషన్లు పడిపోయాయి. లక్ష్యాన్ని చేరుకోలేకపో యారు. ఇదే పరిస్థితి జూన్‌లో ఉంటే ఏడాది లక్ష్యం చేరుకోవడం కష్టమేనన్న ఆందోళన సబ్‌ రిజిస్ర్టార్లలో నెలకొంది.

నాన్‌ లేఅవుట్‌లపై నిరాశ
 నాన్‌ లేఅవుట్‌లపై ప్రభుత్వం నిషేధం విధించిం ది. నాన్‌లేఅవుట్‌లలో స్థలా లను రిజిస్ర్టేషన్‌ చేయ కూడదంటూ దిశానిర్దేశం చేసింది. ఇదికూడా రిజిస్ర్టేషన్‌లపై ప్రభావం చూపుతోందని లెక్కలు కడుతున్నారు. ఆదాయం పడిపోవడానికి నిషేధం ఒక కారణంగా వెలుగులోకి తెస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిం చారు. అందులో సానుకూల నిర్ణయం వెలువడుతుందని అంతా ఆశించారు. కానీ నాన్‌ లేఅవుట్‌లపై వెసులుబాటు ఇచ్చేది లేదంటూ ఉన్నతాధికారులు తెల్చేశారు. దానికితోడు ఇప్పుడు ధరలు పెంచుతున్నారు. అదే ఇప్పుడు సబ్‌ రిజిస్ర్టార్‌లను ఆందోళనకు గురిచేస్తోంది.

Updated Date - 2022-05-22T05:52:44+05:30 IST