ఆ రెండు కిలోమీటర్లు నరకప్రాయం

Published: Thu, 20 Jan 2022 23:52:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon

 ఆ రెండు కిలోమీటర్లు నరకప్రాయం
అధ్వానంగా పామాయిల్‌ ఫ్యాక్టరీ రహదారి
20 ఏళ్ల కిందట నిర్మాణం.. మరమ్మతుల ఊసే లేదు
ప్రమాదాల బారిన వాహనదారులు


పెదవేగి, జనవరి 20 : పెదవేగిలో ఉన్న ప్రభుత్వ పామాయిల్‌ ప్రాసెసెంగ్‌ యూనిట్‌ (పామాయిల్‌ ఫ్యాక్టరీ)కు వెళ్లే రోడ్డు గోతులతో అధ్వానంగా మారింది.  ఈ ఫ్యాక్టరీకి ఆయిల్‌పామ్‌ గెలలను తీసుకుని నిత్యం టాక్టర్లు, లారీలు వస్తుం టాయి. మండల కేంద్రం పెదవేగి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే ఈ ఫ్యాక్టరీ వస్తుంది. అయితే ఈ రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే నరకం కనిపి స్తోందని వాహనదారులు వాపోతున్నారు. రైతులు అష్టకష్టాలు పడుతూ  గెలల ను ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఈ రహదారి ఒకప్పుడు రాట్నాలకుంట  రాట్నా లమ్మ ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిగా ఉండేది. అయితే ఈ రహదారి పూ ర్తిగా పాడవ్వడం, అదే సమయంలో పెదవేగి నుంచి మరోవైపు వేరొక రహ దారిని అభివృద్ధి చేయడంతో భక్తులు ఎక్కువగా కొత్త రహదారినే రాట్నాల కుంట వెళ్తున్నారు. దీంతో ఈ రహదారిని ప్రధానంగా పామాయిల్‌ ఫ్యాక్టరీకి వెళ్లే వాహనదారులు, ఆ ప్రాంతంలో ఉన్న రైతులు వినియోగిస్తున్నారు. నిత్యం టన్నుల కొద్ది ఆయిల్‌పామ్‌ గెలలతో కూడిన వాహనాలు తిరుగుతుండడంతో ఆ రహదారి పూర్తిగా గుంతలు పడి ధ్వంసమైంది. రెండు దశాబ్దాల కిందట అప్ప టి దెందులూరు ఎమ్మెల్యే గారపాటి సాంబశివరావు హయాంలో ఈ రహదారిని బీటీ రహదారిగా అభివృద్ధి చేశారు. నాటి నుంచి ఈ రహదారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదంటే ఈ రహదారి దుస్థితి అర్థం చేసు కోవచ్చు. ఈ రహదారిపై అయిల్‌పామ్‌ గెలలతో వెళ్తున్న ట్రాక్టర్లు ప్రమాదానికి గురికాగా పలువురు గాయాలతో బయటపడ్డారు. ఇప్పటికైనా ఈ రహదారి ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని, పూర్తిస్థాయి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


భయపడుతూ ట్రాక్టర్‌ నడుపుతున్నా..
పెదకడిమిలో రైతు దగ్గర ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ, గత 15 ఏళ్లుగా ఫ్యాక్టరీకి పామాయిల్‌ గెలలు తీసుకొస్తున్నాను.   కొన్నేళ్లుగా ఈ రహదారిని పట్టించుకోకపోవడంతో గోతులతో నిం డిపోయింది. అజాగ్రత్తగా ఉంటే ట్రాక్టర్‌ బోల్తా కొడుతుంది.  ఈ రెండు కిలోమీటర్ల దూరంలో ట్రాక్టర్‌ను భయపడుతూ నడపాల్సి వస్తోంది.


– బుల్లా ఏసు, ట్రాక్టర్‌ డైవర్‌, పెదకడిమి
ఒళ్లు హూనం అవుతోంది..
 పామాయిల్‌ ఫ్యాక్టరీకి సమీపంలోనే మాకు ఆయిల్‌పామ్‌ తోట ఉంది. రోజూ ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా తోటకు వెళ్లాల్సిందే. నిత్యం పామాయిల్‌ గెలలతో ట్రాక్టర్లు, లారీలు ఫ్యా క్టరీకి వెళ్తుంటాయి. దీంతో ఈ రహదారి మొత్తం  ధ్వంసమైంది. ఈ రహదారి బాగోగులు పట్టించుకున్న నాథుడే లేకపోవడంతో  ఈ రహ దారిపై ప్రయాణంతో ఒళ్లంతా హూనం అవుతోంది నిత్యం ఈ రోడ్డులో ప్రమాణిస్తూ, అనారోగ్యానికి గురౌతున్నాను.
– మూల్పూరి నగేష్‌, రైతు, లక్ష్మీపురం

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.