అధ్వానంగా కొల్లేరు రోడ్డు

ABN , First Publish Date - 2021-04-24T04:46:59+05:30 IST

ఏలూరు నగరంలోని గూడ్సు షెడ్డు రోడ్డు లోని రైల్వేస్టేషన్‌ నుంచి చాటపర్రు తదితర కొల్లేరు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గోతులమయమై అస్తవ్యస్తంగా ఉంది.

అధ్వానంగా కొల్లేరు రోడ్డు
కోడేలు వద్ద రోడ్డంతా గోతులమయం

ఏలూరు కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 23: ఏలూరు నగరంలోని గూడ్సు షెడ్డు రోడ్డు లోని రైల్వేస్టేషన్‌ నుంచి చాటపర్రు తదితర కొల్లేరు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గోతులమయమై అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోడ్డులో  రేయింబవళ్లు వం దలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ రోడ్డు గోతులమ యమైంది. గోతుల కారణంగా వాహనదారులు ప్రమాదాల పాలవుతున్నా పాల కులు పట్టించుకోవడం లేదని కొల్లేరు గ్రామాల వాసులు విమ ర్శిస్తున్నారు. రెండు నియోజక వర్గాలను కలిపే ఈ రోడ్డు దారు ణంగా మారినా ఎవరికీ పట్టడం లేదని వాపో తున్నారు. దెందులూ రు, ఏలూరు నియో జక వర్గాల ప్రజాప్రతి నిధులు కలుగ చేసు కుని ఈ రోడ్డుకు మో క్షం కల్పించాలని అయా గ్రామాల  ప్ర జలు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-24T04:46:59+05:30 IST