నిబంధనలు బేఖాతర్‌.. పాఠశాలల నిర్వహణ

ABN , First Publish Date - 2021-04-24T04:40:15+05:30 IST

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఒంటిపూట బడుల ను నిర్వహించకుండా తరగతు లను నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీ సుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ ఏలూరు నగర కార్యదర్శి పి.శివశంకర్‌ డిమాండ్‌ చేశారు.

నిబంధనలు బేఖాతర్‌.. పాఠశాలల నిర్వహణ

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 23 : ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఒంటిపూట బడుల ను నిర్వహించకుండా తరగతు లను నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీ సుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ ఏలూరు నగర కార్యదర్శి పి.శివశంకర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగరంలో ఒంటిపూట బడుల సమయాల్లో రెండు పూటలా తరగతు లు నిర్వహిస్తున్న పలు ప్రైవేటు విద్యా సంస్థల వద్దకు వెళ్లి విద్యార్థులను ఇళ్లకు పంపించివేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు శివశంకర్‌ మాట్లాడుతూ నగరంలో కరోనా వ్యాప్తి ఉధృతి ఉన్న ప్పటికీ పలు ప్రైవేటు విద్యా సంస్థలు కొవిడ్‌ రూల్స్‌ పాటించ కుండా తరగతు లు నిర్వహిస్తున్నాయని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసు కెళ్లినా పట్టించుకో వడం లేదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.రాజేష్‌, లీలాకృష్ణ, మణికాంత్‌, రాకేష్‌ పాల్గొన్నారు. నగరంలో పలు ప్రైవేటు విద్యా సంస్థలు తరగతులు నిర్వహిస్తుండడం పట్ల డీఈవో సి.వి.రేణుక ఆగ్ర హం వ్యక్తం చేశారు.  దీనిపై ఆరా తీసి ముందస్తు నోటీసు లేకుండా పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చ రించారు.

Updated Date - 2021-04-24T04:40:15+05:30 IST