వస్త్ర దుకాణాల్లో తగ్గని పండగ సందడి

ABN , First Publish Date - 2021-01-17T05:46:09+05:30 IST

సంక్రాంతి పండగను పురస్కరించుకుని నగ రంలోని వస్త్ర దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.

వస్త్ర దుకాణాల్లో తగ్గని పండగ సందడి

కనిపించని కొవిడ్‌ ప్రభావం

స్వల్పంగా తగ్గిన రెడీమేడ్‌ వ్యాపారం

ఏలూరు రూరల్‌, జనవరి 16: సంక్రాంతి పండగను పురస్కరించుకుని నగ రంలోని వస్త్ర దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. బుధవారం నుంచి శనివారం వరకు పండగ సందడి కనిపించింది. కొత్త దుస్తులు కొనుగోలు చేయని వారంతా శనివారం దుకాణాలకు వచ్చారు. గతే డాది మాదిరిగానే విక్రయాలు జరిగాయని వ్యాపారులు చెబుతు న్నారు. సంక్రాంతి పండుగ వారం రోజుల్లో సుమారు రూ.25 కోట్లకు పైగా విక్రయాలు జరిగి ఉంటాయని వ్యాపారులు అం చనా వేస్తున్నారు. మిగిలిన పండుగలతో పోల్చుకుంటే సం క్రాంతి ప్రత్యేకం. అందరూ కొత్త దుస్తులు కొనుగోలు చేస్తుం టా రు. దీంతో పండుగ 15 రోజుల ముందు నుంచే వస్త్ర దుకాణాలకు తాకిడి మొదలవుతుంది. అయితే ఈ ఏడాది కరోనా ప్రజల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోవడంతో ఆదా యం తగ్గింది. అయితే సంక్రాంతికి మునుపటి స్థాయిలో వస్త్ర వ్యాపారాలు ఉండకపోవచ్చని వస్త్ర వ్యాపారులు భావించారు. కానీ వ్యాపారుల అంచనా లను తలకిందులు చేస్తూ కొనుగోలుదారులు దుకాణాలకు భారీగా తరలి వ చ్చారు. ఏలూరు నగరంలో చిన్న పెద్ద వస్త్ర దుకాణాలు దాదాపు 50కి పైగా ఉన్నాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లే కాకుండా సాధారణ రోజుల్లో రోజుకు సగటున రూ.25 లక్షల వ్యాపారం చేస్తాయి. పండగ సీజన్‌లో మాత్రం అన్ని వస్త్ర దుకాణాల్లో సుమారు రూ.25 కోట్లకు పైగా విక్రయాలు జరిగి ఉంటుం దని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గతేడాదికి ఏ మాత్రం తీసిపోని విధంగా విక్రయాలు సాగాయి. అయితే రెడీమేడ్‌ వ్యాపారానికి కొంచెం గిరాకీ తగ్గింది.


విక్రయాలపై మూఢం ప్రభావం


గతేడాది సంక్రాంతి అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది రెడీమేడ్‌ వ్యాపారం తక్కువగా జరిగింది. కరోనా నేపథ్యంలో గత పది నెలలుగా చాలా మంది దుస్తులు కొనుగోలు చేయలేదు. అలాంటి వారంతా సాధారణంగా కొనుగోలు చేసే కంటే తక్కువగా దుస్తులు కొనుగోలు చేశారు. సాధారణంగా సంక్రాంతి తర్వాత పెళ్ళిళ్ళ సీజన్‌ ఉంటుంది. కాబట్టి ఆ వ్యాపారం కూడా ఏటా సంక్రాంతి సీజన్‌లోనే కలిసేది. కాని గతంలో ఎన్నడూ లేని విధంగా మాఽఘమాసంలో మూఢం రావడంతో వస్త్రాలు కొనుగోలు లేకపోవడం, విక్రయాలపై కొంత ప్రభావం పడింది. 

– కత్తిరి రామ్మోహనరావు, రెడీమేడ్‌ వస్త్ర దుకాణ  వ్యాపారి 

Updated Date - 2021-01-17T05:46:09+05:30 IST