దిశ యాప్‌తో విద్యార్థినులకు భరోసా : ఎస్పీ

ABN , First Publish Date - 2021-07-24T05:48:59+05:30 IST

విద్యార్థినులు తమ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో దిశ యాప్‌ కలిగి ఉంటే పోలీసు తమ వెంటే ఉన్నట్టు భరోసా ఉంటుం దని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సూచించారు.

దిశ యాప్‌తో  విద్యార్థినులకు భరోసా : ఎస్పీ
దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

ఏలూరు క్రైం, జూలై 23 : విద్యార్థినులు తమ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో దిశ యాప్‌ కలిగి ఉంటే పోలీసు తమ వెంటే ఉన్నట్టు భరోసా ఉంటుం దని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సూచించారు. ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యార్థి నులకు దిశ యాప్‌పై నిర్వహించిన అవగాహన కార్య క్రమానికి ముఖ్య అతిఽథిగా ఆయన హాజర య్యారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దిశ యాప్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఉంటే ఆపద సమయంలో యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ ఉపయోగించిన 8 నిముషాల కాల వ్యవధి లోనే పోలీసులు అక్కడకు చేరుకుంటారన్నారు. జిల్లా ఎస్పీ వాట్సాప్‌ నెంబర్‌ 95503 51100కి గాని డయల్‌ 100కు గాని, 112కు గాని ఫోన్‌ చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ఎస్‌సీహెచ్‌ కొండలరావు, త్రీటౌన్‌ సీఐ కేవీఎస్‌వీ ప్రసాద్‌, టూ టౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌, ఆర్‌ఐ కృష్ణంరాజు పాల్గొన్నారు.   

Updated Date - 2021-07-24T05:48:59+05:30 IST