‘స్పందన’ స్వల్పమే

ABN , First Publish Date - 2021-07-27T05:34:54+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ మళ్లీ మొదలైంది.

‘స్పందన’ స్వల్పమే
అర్జీలు స్వీకరిస్తున్న జేసీ శుక్లా

అర్జీదారులు నామమాత్రం

ఏడాదిన్నర తర్వాత ఫిర్యాదుల స్వీకరణ

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌తో నిలుపుదల

కొవిడ్‌, లాక్‌డౌన్లతో పూర్తిగా వాయిదా

ఏలూరు, జూలై 26(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ మళ్లీ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌తో ఆగిన అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణ ఏడాదిన్నర తర్వాత సోమవారం జరిగింది. కలెక్టరేట్‌లో అర్జీదారులు, ఫిర్యాదుదారులు నామమాత్రంగానే రావడంతో ఆశించిన స్పందన రాలేదు. గత ప్రభుత్వ హయాంలో స్థానికంగా పరిష్కారం కాని సమస్యలతో వందలు, వేల సంఖ్యలో అర్జీదా రులు కలెక్టరేట్‌లో బారులు తీరేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ తీసు కున్నా అర్జీదారుల బారులు తగ్గేవి కావు. అలాం టిది స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌తో 2020 జనవరిలో స్పందన తాత్కాలికంగా నిలిచింది. ఆ తరువాత కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌, ఫస్ట్‌వేవ్‌, సెకండ్‌ వేవ్‌ అంటూ రకరకాల అవాంతరాల మధ్య వాయిదా పడుతూ వచ్చింది. దీనికి తోడు సచివాలయ స్థాయిలో స్పందన కౌంటర్లు ఏర్పాటు చేయడంతో.. కలెక్టరేట్‌లో సోమవారం స్పందనకు 130 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.  

Updated Date - 2021-07-27T05:34:54+05:30 IST