మండే సూర్యుడు

ABN , First Publish Date - 2022-05-24T06:14:06+05:30 IST

ఇంట్లో ఉక్కపోత..బయటకు వస్తే ఎండ ధాటికి ప్రజలు, ప్రయాణికు లు బెంబేలెత్తుతున్నారు.

మండే సూర్యుడు
భీమరంలో ప్రభుత్వాస్పత్రి రోడ్డు ఇలా..

ఠారెత్తిస్తున్న ఎండలు
వడగాడ్పులతో ప్రజలు బెంబేలు

భీమవరం టౌన్‌/ ఉండి, మే 23 : ఇంట్లో ఉక్కపోత..బయటకు వస్తే ఎండ ధాటికి ప్రజలు, ప్రయాణికు లు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజులు నుంచి ఎండలు మండు తున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎండ తీవ్రతతో పాటు వడగాడ్పులు వీయడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆకివీడులో 44, నరసాపురం, భీమవరంలో 43 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. వాహనాలపైన వెళ్లేవారు, పాదచారులు వడదెబ్బకు భయపడిపోయారు.దాహార్తిని తీర్చుకునేందుకు రోడ్ల పక్కన ఉండే చలివేంద్రాలను ఆశ్రయించారు. ఉండి మండలంలో  ఎండలకు కొల్లేరులో కిక్కిస మంటలు తోడు కావడంతో అధిక వేడిమికి గురయ్యారు. ఉద యం 11 గంటలు దాటితే రహ దారులు నిర్మానుష్యంగా మారుతున్నా యి. ఇప్పుడే ఇలా ఉంటే రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండడంతో ఎండలు ఇంకెలా ఉంటాయోనని ఆందోళన నెలకుంది.

Updated Date - 2022-05-24T06:14:06+05:30 IST