కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-09T05:15:00+05:30 IST

రాష్ట్రంలో కరోనా తీవ్రస్ధాయిలో ఉందని వైరస్‌ను అరికట్టడానికి ప్రభుత్వం తక్షణమే వ్యాక్సి నేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాల య సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌ అన్నారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం
జగన్నాథపురంలో చింతమనేని నిరసన దీక్ష

టీడీపీ నాయకుల నిరసన 

ఏలూరు టూటౌన్‌, మే 8: రాష్ట్రంలో కరోనా తీవ్రస్ధాయిలో ఉందని వైరస్‌ను అరికట్టడానికి ప్రభుత్వం తక్షణమే వ్యాక్సి నేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాల య సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌ అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉంచాలంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పాలి ప్రసాద్‌ మాట్లాడుతూ  ఎక్కడ చూసినా బెడ్లు, ఆక్సిజన్‌, వెంటి లేటర్లు కొరత ఉందన్నా రు. ప్రజలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అచ్యుత బాబు, ఎల్‌.రవీంద్రబాబు, కొల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. 

 ప్రభుత్వ చర్యల వల్ల అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తన కార్యాలయంలో నిరసన దీక్ష  చేపట్టారు.  వ్యాక్సినేషన్‌ ఎప్పుడు ఎవరికి వేస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో కప్పా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

  అందరికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలను కాపా డాలని తెలుగుదేశం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు అన్నారు. శని వారం ఆయన క్యాంపు కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.  విప త్తులను ఎదుర్కొలేని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతి పక్ష నాయ కుడు చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపు చర్యలు మాని కరోనాను అరికట్టడంలో దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఎం.శ్రీనివాస్‌, రెడ్డి ఈశ్వరరావు, దాలి రాజు, విఠల్‌, ఎన్‌ వెంకట లక్ష్మి, అప్పారావు, ఎలీషా తదితరులు పాల్గొన్నారు. 

 దెందులూరులో..

దెందులూరు, మే 8: ప్రభుత్వం వెంటనే కరోనా నివారించేందుకు 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా నివారణ వ్యాక్సిన్‌ అందించాలని, దీనితో పాటు ప్రభుత్వం ముందు చూపు ప్రదర్శించి కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని దెందులూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యిప్పిలి వెంకటేశ్వరావు అన్నారు. దెందులూరు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం కరోనా నిబంధనలు పాటిస్తూ తెలుగు విద్యార్థి విభాగం ఏలూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌ యాదవ్‌తో కలిసి వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు వారు నిరసన తెలిపారు.  

పెదవేగిలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని నిరసన 

పెదవేగి, మే 8 : ప్రజారోగ్యం పరిరక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దెందులూరు మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకాలు వేయాలని కోరుతూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలో భాగంగా చింతమనేని ప్రభాకర్‌ జగన్నాథపురంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలను తీస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేసిందన్నారు. దేశమంతా 18ఏళ్ళు వయస్సు వారందరికీ టీకాలు వేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం అప్పుడే కాదంటూ కాలయాపన చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు.  

Updated Date - 2021-05-09T05:15:00+05:30 IST