మా ఫోన్‌లో డౌన్‌లౌడ్‌ చేయం..!

ABN , First Publish Date - 2022-08-18T06:29:04+05:30 IST

ఉపాధ్యాయులందరూ విధిగా తమ సెల్‌ఫోన్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను జిల్లాలో రెండోరోజూ ఉపాధ్యాయులు బహిష్కరించారు.

మా ఫోన్‌లో డౌన్‌లౌడ్‌ చేయం..!
గూట్లపాడులో హెచ్‌ఎంకు మెమోరాండం అందజేస్తున్న ఉపాధ్యాయులు

ఫ్యాప్టో పిలుపుతో రెండోరోజూ ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను బహిష్కరించిన ఉపాధ్యాయులు
నామమాత్రంగానే యాప్‌ డౌన్‌లోడ్‌.. అయినా సహకరించని సర్వర్‌

భీమవరం, ఆగస్టు 17 : ఉపాధ్యాయులందరూ విధిగా తమ సెల్‌ఫోన్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను జిల్లాలో రెండోరోజూ ఉపాధ్యాయులు బహిష్కరించారు.  ఫ్యాఫ్టో ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయుల సంఘాల యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఆపివేశారు. జిల్లాలో 5,441 మంది ఉపాధ్యాయులు ఉండగా 2,021 మంది ఉపాధ్యాయులు రిజిస్టర్‌ అయ్యారు. తొలిరోజు 402 మంది మాత్రమే ఈ యాప్‌ ద్వారా అటెం డెన్స్‌ నమోదు చేయించుకోగా రెండో రోజు ఆ సంఖ్య మరో 100 పెరిగిందంతే.  విద్యాశాఖ ఒత్తిళ్ల మేరకు పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు డౌన్‌లోడ్‌ ప్రయత్నించినా సర్వరు సహకరించలేదు. అయితే పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయులు డౌన్‌లోడ్‌ బహిష్కరణ కొనసాగించారు. ఫ్యాఫ్టో రాష్ట్ర కమిటీ స భ్యుడు, యూటీఎఫ్‌ నాయకుడు బి.గోపిమూర్తి మాట్లాడుతూ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవద్దని ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు కొనసాగిందని, ఒకవేళ ఎవరైనా ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకుంటే హాజరుని అప్లోడ్‌ చేయొద్దని సూచిం చారు.
భీమవరం మండలంలో బహిష్కరణ
యాప్‌ను సొంత ఫోనులో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఇచ్చిన ఉత్త ర్వుల పట్ల అభ్యంతరం తెలుపుతూ గూట్లపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బహిష్కరించారు. ప్రభుత్వం కొత్త డివైస్‌లు ఇచ్చి ఇంటర్నెట్‌ సౌకర్యం కలిగిస్తే ఫేషియల్‌ అటెండెన్స్‌ వేయడానికి తమకు ఏవిధమైన అభ్యంతరం లేదని తెలియజేస్తూ, అప్పటి వరకూ సొంత ఫోన్‌లో ఇంటిగ్రేడ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని ప్రధానపాధ్యాయులకు మెమోరాండం ఇచ్చారు.

Updated Date - 2022-08-18T06:29:04+05:30 IST