ఆలయ ప్రాంగణంలో విరిగిపడిన ధ్వజస్తంభం
ఆచంట, మే19 : ఆచంట మండలం కొడమంచిలి గోపాలస్వామి ఆలయ ధ్వజ స్తంభం గురువారం విరిగిపడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరడంతో విరిగి పడిపోయినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. సుమారు 60 ఏళ్ల క్రితం ఆల యం లో దీనిని ఏర్పాటు చేశారు. కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తామని ఆలయ అధికారి ఆర్‌వీఎస్ రాము తెలిపారు.