ఆలయాల చోరీల్లో సిద్ధహస్తుడు!

ABN , First Publish Date - 2021-01-22T05:38:41+05:30 IST

దేవాలయాలపై జరు గుతున్న దాడులను ఛేదించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

ఆలయాల చోరీల్లో సిద్ధహస్తుడు!


 పోలీసుల అదుపులో విజయవాడ రథం 3 సింహాల చోరీ కేసు  నిందితుడు

 ఇతని స్వగ్రామం గొల్లవానితిప్ప

ఏలూరు క్రైం, జనవరి 21: దేవాలయాలపై జరు గుతున్న దాడులను ఛేదించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. చర్చి లు, మసీదులు, దేవాల యాల దగ్గర సీసీ కెమె రాలు ఉండాలని ఆదేశా లు జారీచేసి ఆ దిశగా ఏర్పాట్లుచేశారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులు దొంగతనాలను ఛేదించేందుకు పోలీసులు పాత నేరస్తుల చిట్టాను పట్టుకుని ఒక్కొ క్కరిని అదుపులోకి తీసుకుంటూ విచారణ చేపడుతు న్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన ఓ నేరస్తుడు పోలీసులకు చిక్కడంతో అతను పాల్పడిన నేరాలు విన్న పోలీసులు అవాక్కయ్యారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ రథంపై ఉండే మూడు సింహాల ప్రతిమల కేసు చిక్కుముడి ఆ నేరస్తుడితో వీడనుంది. ఈ కేసులో కీలక నిందితుడిని గుర్తించిన విజయవాడ పోలీసులు అతన్ని అదుపులోకి తీసున్నట్లు సమాచారం. ప్రస్తుతం మంగళగిరిలోని పోలీ సు బెటాలియన్‌ క్యాంపు కార్యాలయంలో అతన్ని విచారి స్తున్నట్లు తెలిసింది. కీలకమైన ఈ కేసును ఛేదించేందు కు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. 2012లో జిల్లా లోని భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లో గుడుల్లో చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడు భీమవరం సమీపంలోని గొల్లవానితిప్పకు చెందిన జక్కంశెట్టి సాయి బాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతం లో పలు గుడుల్లో చోరీల కేసుల్లో నిందితుడిగా వున్న సాయిబాబును ఆయా ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్‌ చే శారు. అతను 2012 నిడదవోలులో ఓ గుడిలో చోరీకి పాల్పడగా అరెస్ట్‌చేసి రిమాండ్‌ అనంతరం విడిచిపె ట్టారు. అంతకుముందు పలుసార్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో గుడుల్లో చోరీలకు పాల్పడే దొం గలను జల్లెడ పడుతున్న పోలీసులకు సాయిబాబా చిక్కాడు. అతన్ని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. మూ డు రోజుల క్రితమే అతనిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మూడు సింహాల ప్రతిమలను అతనే చోరీ చేసినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. దీనిపై పోలీ సులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వ లేదు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు తునికి చెందిన ఓ బంగారు వ్యాపారిని పోలీసులు అరెస్ట్‌ చేసి నట్లు తెలిసింది. మిగిలిన నేరస్తులపై స్థానికంగా ఉన్న పోలీసులు ఒక్కొక్కరిని పిలిచి వారి నుంచి వాంగ్మూ లాలు నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-01-22T05:38:41+05:30 IST