నేటి నుంచి సీనియర్‌ సిటిజన్లకు కొవిడ్‌ టీకా

ABN , First Publish Date - 2021-03-01T05:21:18+05:30 IST

కొవిడ్‌ టీకా మందు మలిదశ పంపిణీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది.

నేటి నుంచి సీనియర్‌ సిటిజన్లకు కొవిడ్‌ టీకా

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 28 : కొవిడ్‌ టీకా మందు మలిదశ పంపిణీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఆరోగ్య కార్యకర్తలు, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, మునిసిపల్‌ ఉద్యోగులు, పోలీసులకు టీకా వేస్తుండగా సోమవారం నుంచి  సాధా రణ ప్రజలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 2.0 ప్రో గ్రాంలో భాగంగా 45 సంవత్సరాల వయస్సు నుంచి 59 సంవత్సరాల్లోపు వయసు కలిగి దీర్ఘకాలిక వ్యాధులతో (షుగర్‌, కిడ్నీ వ్యాధులు, కేన్సర్‌ వంటివి) బాధపడేవారికి టీకా మందు వేస్తారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు, కో–మార్బిడ్‌ పరిస్థితులు వారు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎలో గుర్తింపు ఉన్న) వైద్యుడు జారీ చేసే ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండా 60 ఏళ్లు దాటిన ప్రతీఒక్కరూ వ్యాక్సినేషన్‌కు అర్హులే.అన్ని ప్రభుత్వాసు పత్రుల్లో వ్యాక్సినే షన్‌కు నేరుగా ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానంలో కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ మేరకు జిల్లాలో అన్ని ప్రభుత్వాసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా మందు వేస్తారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునంద తెలిపారు. తొలుత నమోదు చేయించుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా ఒక కార్డును తీసుకు వెళ్ళాల్సి ఉంటుందన్నారు. ఆధార్‌ , పాన్‌ ్డ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు కార్డు, బ్యాంకు అకౌంట్‌ బుక్‌ వంటివి తీసుకువెళ్ళి నమోదు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలోని ఏడు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో రూ.250 చెల్లించి ఫ్రీ రిజిస్ట్రేషన్‌తో నిమిత్తం లేకుండా వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్‌ ఆండ్రు వివరించారు. జిల్లాలో ఏలూరు ఆశ్రం, ఆంధ్ర హాస్పటల్‌, తణుకులో సుధ, యాపిల్‌ ఆస్పత్రులు, తాడేపల్లిగూడెం మదర్‌ వన్నిని ఆస్పత్రి, భీమ వరం వర్మ ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి ఆస్పత్రుల్లో ఎవరైనా రూ.250 చెల్లించి నేరుగా టీకా మందు వేయించుకోవచ్చు.

50 వేల డోసులు నిల్వ.. నేడు మరికొన్నిరాక

జిల్లాలో 50 వేల డోసుల వ్యాక్సిన్‌ నిల్వలు ప్రస్తుతం ఉండగా, సోమవారం సాయంత్రానికి మరికొన్ని డోసులు వస్తాయని డీఎంహెచ్‌వో కార్యాలయ వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్‌పై వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు, టీకా వేయించుకున్న తరువాత వచ్చే సందేహాలపై సమాధానాలు ఇచ్చేందుకు 24 గంటలు పనిచేసే విధంగా 104 కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Updated Date - 2021-03-01T05:21:18+05:30 IST