నిర్లక్ష్యం.. అతివేగం

ABN , First Publish Date - 2021-03-08T06:18:04+05:30 IST

నిశి రాత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రాక్టర్‌పై దైవ దర్శనానికి వెళుతున్న 30 మంది భక్తులను ఓ లారీ ఢీకొట్టింది.

నిర్లక్ష్యం.. అతివేగం
ప్రమాదానికి కారణమైన లారీ..

గుబ్బలమంగమ్మ గుడికి వెళుతుండగా విషాదం

ఆగి వున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. 

ఇద్దరి మృతి.. 20 మందికి గాయాలు

జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆసుపత్రుల్లో చికిత్స

ఏలూరు క్రైం/జంగారెడ్డిగూడెం, మార్చి 7 : నిశి రాత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రాక్టర్‌పై దైవ దర్శనానికి వెళుతున్న   30 మంది భక్తులను ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా.. 20 మంది గాయపడ్డారు. జంగారెడ్డి గూడెం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగిన ప్రమాదం వివరాలివి.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం పంచాయతీలోని కండ్రికకు చెందిన సుమారు 75 మంది మూడు ట్రాక్టర్లు, ఒక పాసిం జర్‌ ఆటోలో శనివారం అర్ధరాత్రి బయలుదేరి ఏజెన్సీ ప్రాం తం బుట్టాయిగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ గుడి కి బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున జంగా రెడ్డిగూడెం దాటిన తరువాత బైపాస్‌ రోడ్డులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి శ్రీనివాసపురం జంక్షన్‌ వద్ద ఒక ట్రాక్టర్‌ ఆపారు. వారు దిగుతుండగా కొయ్యలగూడెం నుంచి అశ్వారా వుపేట వైపునకు అతివేగంగా వెళ్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ ట్రాక్టర్‌ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో అది బోల్తా పడిం ది. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మిగి లిన ట్రాక్టర్లలోవున్న వారు.. స్థానికులు వీరిని కాపాడే ప్రయ త్నం చేశారు. ప్రైవేట్‌ ఆటోలు, 108 అంబులెన్స్‌ల్లో క్షతగా త్రులను సమీపంలోని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే వేమారెడ్డి రాంబాబు(50), ఆసుపత్రిలో బోళ్ళ వెంకటేశ్వరరావు, కోటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె సహస్ర (2) మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో వేమారెడ్డి కుమారి, ఆదిత్యకు మార్‌, వీరయ్య, గణపతి, అశ్వినికుమార్‌, రమాదేవి, బంటు రమాదేవి, శివమ్మ, శ్రావణి, రమణ, హచ్చిదాస్‌ బాలా శిరీషా, శ్రీను, గొల్ల పుట్లమ్మ, సుశీల, కుమారి, శ్రీనివాసరావు, ఆవుల సాంబయ్య, చేమల సీతా మహాలక్ష్మి, లాము రవికుమార్‌ ఉన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకున్నామని ఎస్పీ కె.నారాయణ నాయక్‌ చెప్పారు. ఏలూరులో క్షతగాత్రులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. 

సంఘటన దురదృష్టకరం : మంత్రి నాని 

రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రి ఆళ్ళ నాని అన్నారు. ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై జిల్లా ఆసుపత్రి సేవల సమన్వ యాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ను అడిగి తెలుసుకు న్నారు. అవసరమైతే మెరుగైన వైద్య సేవలందించడానికి విజ యవాడకు తరలించాలని ఆదేశిం చారు. బాధితులకు అన్ని విధా లా సహకారం అందిస్తామని చెప్పారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ డాక్టర్‌ కిరణ్‌, అక్కడ పోలీ సులు, 108 అంబులెన్సులు నాలుగు నిమిషాల్లోనే చేరుకుని సేవలందించడం ఎంతో అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. 

సకాలంలో స్పందించారు

ప్రమాదం జరిగిన సమయంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఒక్క డాక్టర్‌ (కంటి స్పెషలిస్ట్‌) మాత్రమే ఉండ డంతో నర్సులు, సిబ్బంది ద్వారానే ప్రాథమిక చికిత్స అందిం చారు. సమాచారం అందుకున్న డీఎస్పీ రవికిరణ్‌ ఆసుపత్రిలో క్షతగాత్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. స్వతహాగా డాక్టర్‌ కావడంతో డీఎస్పీ క్షతగాత్రులకు చికిత్స చేసి, అవసరమైన ఇంజక్షన్లు చేశారు. బాధితులను ఆర్డీవో ప్రసన్నలక్ష్మి పరామ ర్శించారు. లాము రవికుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమో దు చేసినట్టు జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ కుటుంబరావు తెలి పారు. 



Updated Date - 2021-03-08T06:18:04+05:30 IST