సడలింపుతో రైళ్లలో రద్దీ మొదలు

ABN , First Publish Date - 2021-06-21T05:34:49+05:30 IST

నిన్న మొన్నటి వరకు ఖాళీగా నడిచిన ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కర్ఫ్యూ సడలింపుతో మళ్లీ హౌస్‌పుల్‌ అవుతున్నాయి.

సడలింపుతో రైళ్లలో రద్దీ మొదలు

నరసాపురం, జూన్‌ 20 : నిన్న మొన్నటి వరకు ఖాళీగా నడిచిన ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కర్ఫ్యూ సడలింపుతో మళ్లీ హౌస్‌పుల్‌ అవుతున్నాయి. 100కు పైగా వెయింటింగ్‌ లిస్టు ఉంటున్నది. జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లల్లో నాలుగింటికి డిమాండ్‌ ఏర్పడింది. వీటిలో నరసాపురం నుంచి వెళ్లే లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌, విశాఖ నుంచి హైదరాబాద్‌ నడిచే గోదావరి, కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్లే గౌతమి, హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ, భువనేశ్వర్‌ నుంచి ముంబయి వెళ్లే కోనార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. 

విశాఖ – హైదరాబాద్‌ గోదావరి స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం కూడా వెయింటింగ్‌ లిస్టు రాని పరిస్థితి. సోమవారం వెయింటింగ్‌ లిస్టు 163, మంగళవారం 109, బుధవారం 74, గురువారం ఆర్‌ఏసీ 125, శుక్రవారం ఆర్‌ఏసీ 96 ఉన్నాయి. 

కాకినాడ–లింగంపల్లి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం వెయింటింగ్‌ లిస్టు 206, 21న 143, 22న ఆర్‌ఏసీ 137, 23న 60 టిక్కెట్లు ఉన్నాయి. గురు, శుక్రవారాల్లో 30లోపు టిక్కెట్లు దొరుకుతున్నాయి. 

నరసాపురం–లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం వెయిటింగ్‌ లిస్టు 85 ఉంది. 23న వెయిటింగ్‌ లిస్టు 45కు వెళ్లింది. 23, 24, 25 తేదీల్లో టిక్కెట్లు లభిస్తున్నాయి. 

విశాఖ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం వెయిటింగ్‌ లిస్టు 104 ఉంది. 22న 84, 23న 55 వెయిటింగ్‌ లిస్టులో ఉన్నాయి. 24న ఆర్‌ఏసీ 128, 25న ఆర్‌ఏసీ 95కు వెళ్లింది. ఒక్కొక్క ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ ఫుల్‌ అవుతుండటంతో రైల్వేస్టేషన్లు ప్రయాణీకులతో కళకళలాడుతున్నాయి.

Updated Date - 2021-06-21T05:34:49+05:30 IST