అడియాశలవుతున్న యువకుల ఆశలు.. ‘ఇయర్ క్యాలెండర్’ విడుదల కాకపోవడంతో..

ABN , First Publish Date - 2021-03-01T05:13:59+05:30 IST

నిరు ద్యోగ సమస్య యువతను నీడలా వెంటాడుతోంది..

అడియాశలవుతున్న యువకుల ఆశలు.. ‘ఇయర్ క్యాలెండర్’ విడుదల కాకపోవడంతో..
నిరుద్యోగం.... నిరుత్సాహం

నిరుద్యోగం.... నిరుత్సాహం    

ఉద్యోగాల ఊసెత్తని ప్రభుత్వం

సచివాలయ, వలంటీర్‌ ఉద్యోగాలతో సరి

నోటిఫికేషన్ల కోసం యువత ఎదురుచూపులు

నీటి మూటగా ‘ఇయర్‌ క్యాలెండర్‌’ హామీ


ఏలూరు(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ సమస్య యువతను నీడలా వెంటాడుతోంది. ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది యువకుల ఆశలు అడియాశలవుతున్నాయి. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ ప్రకటనలతో ‘ఇయర్‌ క్యాలెండర్‌’ విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొలువుల ఊసే ఎత్తక పోతుండడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో లక్షలాది మంది యువతీ, యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా ఉపాధి కల్పన కేంద్రం (ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజ్‌)లో 78 వేల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజ్‌ కాకుండా బయటివారిని కూడా కలుపుకుంటే దాదాపు 3 నుంచి మూడున్నర లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.


కొత్తప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో హడా వుడిగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వీటి ద్వారా జిల్లాలోని 9 వేల మందికి నెలకు రూ.15000 ఆదాయం ఇచ్చే చిరుద్యోగాలను కల్పిం చారు. వీటిని ఈ అక్టోబరులో రెగ్యులర్‌ చేయాలి. కానీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదు. వీటితోపాటు నెలకు రూ. 5వేల గౌరవ వేతనంతో జిల్లాలో 18 వేల మందికి వలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చారు. ఇవి ఉద్యోగాలు కావని ఇటీవల ముఖ్య మంత్రి తేల్చి చెప్పేశారు. 


కరోనాతో ఉపాధి కరువు

ఉపాధి లేక అవస్థలు పడుతున్న యువతపై కరోనా, లాక్‌డౌన్‌ పుండు మీద కారం చల్లాయి. విద్యా సంస్థల్లో, చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వేలాది మందికి కరోనా కారణంగా ఉద్యోగాలు ఊడిపోయాయి. గ్రామాల్లో ఉండే చదువు లేని యువతపై కూడా లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రభుత్వ విధానాలతో రియల్‌ ఎస్టేటు రంగం, నిర్మాణరంగం దెబ్బతినిపోవడంతో చాలామంది ఉపాధి కోల్పోయారు. కరోనా కారణంగా వ్యాపార, వాణిజ్య, రవాణా రంగాలు బాగా దెబ్బతిన్నాయి. ఫలితంగా షాపింగ్‌మాల్స్‌, ఫ్యాన్సీ షాపులు, బట్టల షాపుల్లో పనిచేసే వేలాది మంది పని కోల్పోయారు. చిన్న, సన్నకారు పరిశ్రమాధిపతులు ఖర్చు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులకు ఉద్వాసన పలి కారు.ఇలా అన్ని రంగాల్లో ఉపాధి కోల్పోయిన యువత తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురవుతోంది.

Updated Date - 2021-03-01T05:13:59+05:30 IST