వ్యాక్సినేషన్‌కు సహకరించాలి

ABN , First Publish Date - 2021-09-18T05:17:05+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు అన్నా రు.

వ్యాక్సినేషన్‌కు సహకరించాలి

 మేయర్‌ నూర్జహాన్‌

ఏలూరు టూటౌన్‌, సెప్టెంబరు 17 : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు అన్నా రు. మినీ బైపాస్‌ బడేటి పార్కు వద్ద సచివాలయంలో శుక్రవారం మెగా వ్యాక్సి నేషన్‌ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలోని 69 సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్‌, ఎన్‌.సుధీర్‌బాబు, నగర కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌, అడిషనల్‌ కమిషనర్‌ సీహెచ్‌వీ బాపిరాజు, ఎంహెచ్‌ వో గోపాల నాయక్‌, సూపరింటెండెంట్‌ ఎండీ సిరాజుద్దీన్‌, సెక్రటరీ బాపిరాజు, పెదబాబు, ఆదిలక్ష్మి, ఎస్‌.శ్రీనివాస్‌, పాల్గొన్నారు. 

ఏలూరు ఎడ్యుకేషన్‌ : సెయింట్‌ థెరిస్సా మహిళా కళాశాలలో శుక్రవారం కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్ర మాన్ని నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు వ్యాక్సినేషన్‌కు సహకరించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మరియట్టా డిమెల్లో, అధ్యాపకులు పర్యవేక్షించారు.

పెదపాడు : పెదపాడు మండలం వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో శుక్రవారం నిర్వహించిన మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో భాగంగా కొవిషీల్డ్‌ 1700 మందికి, కొవాగ్జిన్‌ 100 మందికి, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో కొవిషీల్డ్‌ 1200 మందికి వ్యాక్సిన్‌ అందించారు. 

పెదవేగి : కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలంలో శుక్రవారం 5100 మందికి టీకాలు వేశామని పెదవేగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ టీవీఎల్‌.ప్రసన్నకుమార్‌ చెప్పారు. మండలంలోని 28 సచివాలయాల్లోనూ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ టీకా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టిందన్నారు. మండలంలో ఇప్పటివరకు 85 శాతం మంది వరకు టీకాలు వేయడం పూర్తయ్యిందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని, టీకాతోనే ఆరోగ్యం చేకూరుతుందన్నారు. కవ్వగుంటలో జరిగిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో డాక్టర్‌ పూర్ణిమ, ఏఎన్‌ఎంలు లలితాదేవి, శైలజ, స్వాతి, సత్యవతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-18T05:17:05+05:30 IST