పోస్టింగ్‌ ఆర్డర్లు ఏవీ..?

ABN , First Publish Date - 2021-04-24T04:43:06+05:30 IST

కష్టకాలంలో కరోనా బాధితులకు సేవలందిం చడానికి తాము ప్రాణాలను ఫణంగా పెట్టి తాత్కాలిక ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యో గు లుగా జిల్లాలో ఉన్న అనేక మంది నిరుద్యోగ యువత చేరారు.

పోస్టింగ్‌ ఆర్డర్లు ఏవీ..?

కొవిడ్‌ ఉద్యోగుల ఎదురుచూపులు

నియామక జాబితాలో పేర్లు మార్పు 

డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు


ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 23: కష్టకాలంలో కరోనా బాధితులకు సేవలందిం చడానికి తాము ప్రాణాలను ఫణంగా పెట్టి తాత్కాలిక ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యో గు లుగా  జిల్లాలో ఉన్న అనేక మంది నిరుద్యోగ యువత చేరారు. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, టెక్నికల్‌ సిబ్బంది, ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు చేరారు. అయితే వారికి ఆరు నెలలు మాత్రమే ఉద్యోగం అని ఉత్తర్వుల్లో ఇవ్వడంతో వారు చేరిన తేదీ నుంచి ఆరు నెలలు పూర్తవగానే ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం కరోనా వేవ్‌టు బాధితులు పెరగడంతో తొలగించిన వారి ఉద్యోగ సేవలను వినియోగిం చుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెల 15వ తేదీన కలెక్టర్‌ అను మతి ఇచ్చారు. జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శా ఖ అధికారి వారి పరిధిలో ఉన్న  ఆస్పత్రులు, కొవిడ్‌ కేంద్రాలకు అవసరమైన వారిని నియమించుకోవాలని అనుమతులు ఇచ్చారు. గతంలో జిల్లాలోని వైద్య విధాన పరిషత్‌  ఆస్పత్రుల్లో కొవిడ్‌ విభాగంలో పనిచేసిన వారికి జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయా ధికారి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌ కేంద్రాల్లో పనిచేసే వారికి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఉద్యోగ నియామక ఉత్తర్వు లు జారీ చేశారు. అయితే రెండు విభాగాల్లో పని చేసిన వారికి జీతాలు మాత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి బ్యాంక్‌ అకౌంట్లలో జమ అయ్యాయి. ప్రస్తుతం ఈనెల 16వ తేదీ నుంచి వైద్య విధాన పరిషత్‌ ఆధ్వ ర్యంలో ఉన్న కొవిడ్‌ ఆస్పత్రులు, ఏలూరు జిల్లా ఆస్పత్రి, తాడేపల్లి గూడెం, త ణుకు, భీమవరం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెంలలో గతంలో పని చేసిన కొవిడ్‌ ఉద్యోగులను తిరిగి విధుల్లో చేరాలని సూచించడంతో అప్పటి నుంచి విధులను నిర్వర్తిస్తున్నారు. వీరందరికి వివరాలు సంబంధిత మెడికల్‌ సూపరింటెండెంట్ల నుంచి డీసీహెచ్‌ కార్యాలయానికి చేరుకుని అక్కడ నుంచి డీఎంహెచ్‌వో కార్యా లయానికి వెళ్లాయి. ఆ లిస్టులకు అక్కడ అనుమతి ఇవ్వాల్సి ఉన్నా డీఎంహెచ్‌ వో కార్యాలయంలో కొందరు ఉద్యోగులు తణుకునకు చెందిన ఒక ఎంఎన్‌వోను మధ్యవర్తిగా పెట్టుకుని పోస్టింగులకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణ లు వస్తున్నాయి. ఇంకోవైపు వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రి నుంచి వెళ్లిన పేర్లను కాదని డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి వేరే పేర్లతో ఉన్న ఉద్యోగ నియామక జాబితా రావడంతో అంతా ఖంగుతిన్నారు. దీంతో తిరిగి వైద్య విధాన పరిషత్‌ విభాగపు అధికారులు డీఎంహెచ్‌వో కార్యాలయం సిబ్బందికి ఘాటుగానే హెచ్చ రికలు జారీ చేసినట్టు సమాచారం. తాము పంపిన లిస్టునే తిరిగి నమోదు చేసుకుని ఇవ్వాలే తప్ప వేరే పేరు చేర్చడం కాని, ఉన్న పేరు తీయడం కాని జరిగితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో శుక్రవారం నుంచి మళ్లీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో లిస్టులను తయారు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి వెల్లడైన లిస్టులను చూసి కొవిడ్‌ ఉద్యో గులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 16వ తేదీ నుంచి కొవిడ్‌ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నా తమకు ఇంతవరకూ పోస్టింగ్‌ ఆర్డర్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.    

Updated Date - 2021-04-24T04:43:06+05:30 IST