పేరుకే.. పెత్తనం!

ABN , First Publish Date - 2021-03-08T06:23:13+05:30 IST

ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అంటూ మహిళలకు ప్రత్యేక గౌరవమిస్తాం. అదేవిధంగా రాజకీయ పదవు ల్లోను 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం.

పేరుకే.. పెత్తనం!
మహిళా దినోత్సవం సందర్భంగా ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో లోగో

లక్ష్యం నెరవేరని రాజకీయ రిజర్వేషన్లు

అక్కడక్కడ మాత్రమే మహిళా సాధికారత

అయితే విభిన్న రంగాల్లో ఆమెదే పైచేయి

భీమవరం, మార్చి 7: ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అంటూ మహిళలకు ప్రత్యేక గౌరవమిస్తాం. అదేవిధంగా రాజకీయ పదవు ల్లోను 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. ఇటీవల జరిగిన స్థానక సంస్థల ఎన్నికలతో పోటీ చేయడం ద్వారా మహిళల పాత్ర మరింత పెరిగింది. ఈ రిజర్వేషన్‌లతో ప్రజా పదవుల్లో ముఖ్యపాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. చదువు కోని మహిళలతోపాటు ఉన్నత చదువులు, ఇంజనీరింగ్‌ చదివిన వారు విజయాలను అందుకున్నారు. జిల్లాలో జరిగిని పంచాయతీ ఎన్నికల్లో 450 మంది వరకు సర్పం చ్‌లు, వేలాది మంది వార్డు సభ్యులుగా కొలువు దీరారు. ఇప్పుడు జరుగుతున్న మునిసిపాలిటీల్లో పదుల సంఖ్యలో మహిళలే కొలువు తీరనున్నారు. ఇక రాబోయే జడ్పీటీసీ, 48 ఎంపీపీ ఎన్నికలతో వీరి ప్రాతినిథ్యం మరింత పెరుగుతుంది. కానీ, వీరిలో కొందరు స్వతం త్రంగా పాలన చేసినప్పటికీ చాలామంది భర్త, తండ్రి, కుమారుడు చాటున పాలన సాగిస్తున్నారు. నామమాత్రంగానే కుర్చీకే పరిమితం అవుతున్న సంఘటనలు చూస్తున్నాం. పంచాయతీ మెంబర్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మునిసిపల్‌ కౌన్సిలర్‌, చైర్మన్‌, జడ్పీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, పదవుల్లో ఉండి తమ సాధికారతను, తమ ఆలోచనలను ప్రజల కోసం వినియోగించే సమయం చాలా పరిమితంగా ఉంటున్నది. వారి పెత్తనాన్ని పురుషులే చెలాయిస్తున్నారు. కొంత మంది మహిళలు మాత్రమే కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో స్వేచ్ఛగా తమ ఆలోచనలతో ప్రజా పరిపాలనలో ముందడుగువేస్తున్నారు. ఇప్పటికైనా మహిళలు స్వతంత్ర నిర్ణయాధికారంతో ముందుకు వెళ్లాలి. అలాగే విభిన్న రంగాల్లో మహిళలు గట్టిగా రాణి స్తున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఉపాఽధి, సేవా, తదితర రంగాల్లో మహిళలు పైచేయి సాధిస్తున్నారు. ఇది మరింత మెరుగుపడాలి. 


మోసపోవద్దు

మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ రాజ్యలక్ష్మి


జిల్లాలో ఉపాధి కోసం విదే శాలకు వెళ్లి మోసపోతున్న కే సులు ఇటీవల బాగా పెరిగా యి. వీటితోపాటు విదేశీ సం బంధాల మోజులోపడి చాలామంది తల్లిదండ్రులు మోస పోతున్నారు. గతంలో వివాహ మైనా.. ఆ విషయాన్ని దాచి పెట్టి పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల మహిళలు మోసాలకు గుర వుతున్నారు. ఇవి ఎక్కువగా ఆన్‌లైన్‌లో వివాహాలు జరుగు తున్నాయి. ఇటీవల సైబర్‌ నేరాలు, గృహహింసలు పెరిగా యి. సోషల్‌ మీడియాలో పరిచయాలు పెంచుకుని మహి ళల్ని మోసం చేయడంతోపాటు వేధింపులు, బ్లాక్‌మెయిల్‌ వంటివి వెలుగుచూశాయి. ఇక ఉద్యోగాల పేరుతో మహిళ లను వ్యభిచార రొంపిలోకి తీసుకెళుతున్న సంఘటనలు ఎ క్కువే. వీటిన్నింటిపై ప్రత్యేక దృష్టిసారించాం. జాతీయ సద స్సుల్లో వీటిపై ప్రధానంగా చర్చిస్తున్నాం. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సదస్సులు నిర్వహిస్తున్నాం. స్కూళ్ళు, కళా శాలల్లో సెమినార్‌లు పెడుతున్నాం. ఈ నేరాలపై తల్లిదం డ్రులకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. చదువు కునే పిల్లల్ని తరచూ గమనిస్తూ ఉండాలని, సీరియల్స్‌, సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచాలని చైతన్య పరుస్తున్నాం. 

– నరసాపురం టౌన్‌ 


 ‘ఉక్కు’ మహిళ.. మనోరమ

ఏలూరు, మార్చి 7(ఆంధ్ర జ్యోతి):‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హ క్కు’ అంటూ పోరాడి సాధించు కున్న విశాఖ ఉక్కు పరిశ్రమను తిరిగి పోరాడే సాధించుకోవాలి అని అంటున్నారు.. నాటి విశాఖ ఉక్కు ఉద్యమ గొంతుక శ్రీమతి సంకు మనోరమ. 1966లో విద్యార్థి యువతరంలో చైతన్యాన్ని రగు ల్కొల్పి.. తన నిరాహార దీక్షతో ఆ మహోద్యమానికి ప్రేరణనిచ్చిన ఆమె.. నేడు అదే పోరాటం మనముందున్న ఏకైక పరిష్కారమని చెబుతున్నారు. ఎక్కడో వచ్చే విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఉక్కు సంకల్పంతో ఏలూరు విద్యార్థిని సంకు మనోరమ పోరాడారు. ఆ తర్వాత అధ్యాపకురాలిగా, ప్రిన్సిపాల్‌గా కొన్నివేల మంది జీవితాలను తీర్చి దిద్దే మహో న్నత కర్తవ్యాన్ని నెరవేర్చారు. వయసు మీద పడి దేహం సహకరించక పోయినా నాటి ఉద్యమ స్ఫూర్తితో.. నేటి ఉక్కు ఉద్యమం కోసం ఆమె మనసు ఉరకలు వేస్తోంది. ఉక్కు పరిశ్రమ సంరక్షణ కోసం మరో మహోద్యమం తప్పదని.. తెలుగు ప్రజలు ఉక్కు పిడికిళ్లు బిగించి ప్రైవేటీకరణను తరిమికొట్టాలని ఆమె ప్రకటిస్తోంది. ఆనాటి విశాఖ ఉద్యమంలో భాగస్వామిని కావడం నాకు గర్వకారణంగా భావిస్తున్నానని అన్నారు. అనేకమంది త్యాగాల ఫలితంగా సాధించిన ఉక్కు పరిశ్రమను అంగట్లో అమ్మకానికి పెట్టడం వారి త్యాగాలను అవమానించడంగానే నేను భావిస్తున్నానని అన్నారు.  


అన్ని రంగాల్లో ప్రాధాన్యం

జేసీలు హిమాన్షుశుక్లా.. తేజ్‌భరత్‌

ఏలూరు సిటీ, మార్చి 7: మహిళలకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని జాయింట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) హిమాన్షు శుక్లా అన్నారు. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సంద ర్భంగా ఆదివారం ఏలూరు ఇండోర్‌ స్టేడియం వద్ద కొవ్వొత్తుల ర్యాలీని జేసీ హిమాన్షుశుక్లా ప్రారంభించి మాట్లాడారు. మెడికల్‌ సిబ్బంది, డాక్టర్లు, శానిటరీ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఎక్కు వ మంది మహిళలే ఉన్నారని, వారు చేసిన సేవల వల్ల కరోనాపై విజయం సాధించామని అన్నారు. జేసీ(సంక్షేమం) తేజ్‌ భరత్‌ మా ట్లాడుతూ ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారన్నారు. ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి లోగోను జేసీలు పరిశీలించారు. స్టేడియం నుంచి  జిల్లా పరిషత్‌ మీదుగా ఫైర్‌ స్టేషన్‌ వరకు క్యాండిల్స్‌ ర్యాలీ చేరుకున్నది. ఫైర్‌ స్టేషన్‌లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు.

Updated Date - 2021-03-08T06:23:13+05:30 IST