వైసీపీలో కీచులాట

ABN , First Publish Date - 2022-05-27T06:05:04+05:30 IST

నరసాపురం వైసీపీ కౌన్సి లర్లలో కీచులాట మొదలైంది.

వైసీపీలో కీచులాట
కౌన్సిల్‌ సమావేశంలో నిరసన తెలుపుతున్న కౌన్సిలర్‌ వన్నెంరెడ్డి (ఫైల్‌)

మంచినీటి ట్యాంకర్‌పై కౌన్సిలర్లు చెరోదారి
డిసెంట్‌ వరకు వ్యవహారం
రాజీయత్నంలో పార్టీ పెద్దలు


నరసాపురం, మే 26 : నరసాపురం వైసీపీ కౌన్సి లర్లలో కీచులాట మొదలైంది. మంచినీటి ట్యాంకర్‌పై అధికార పార్టీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలి పో యారు. ట్యాంకర్‌ సరఫరా విషయంలో ఒక వర్గం మద్దతు ప్రకటిస్తే... మరో వర్గం డిసెంట్‌ ఇచ్చి వ్యతి రేకత తెలిపింది. ఐదురోజుల క్రితం కౌన్సిల్‌లో జరిగిన ఈఘటనతో పార్టీ పెద్దలు సైతం షాక్‌కు గురయ్యా రు. రంగంలోకి దిగి రాజీ యత్నాలు చేస్తున్నారు.
జూ    ప్రస్తుత వేసవిలో పట్టణంలో తాగునీటి ఎద్దడి లేకుండా రెండు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఇటు పురపాలక సంఘం రెండు పూ టల నీరు విడుదల చేస్తోంది. మరో పది రోజుల్లో కాల్వలకు నీటి విడుదల చేయనున్నారు. అయితే ఈనెల 21న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో కొత్తగా మరో ట్యాంకర్‌ను అజెండాలో చేర్చారు. నీటి సరఫ రాకు రూ.6.80 లక్షల ప్రతిపాదనలు పెట్టారు. కౌన్సిల్‌ సమావేశానికి ముందు ప్రతిసారి వైసీపీ కౌన్సిలర్లు  షాడో మీటింగ్‌ నిర్వహించుకోవడం పరి పాటి. వేసవి ముగుస్తున్న సమయంలో ట్యాంకర్‌ ను ప్రతిపాదిస్తే హాస్యాస్పదంగా ఉంటుందని   షాడో సమావేశంలో పలువురు కౌన్సిలర్లు అభ్యం తరం తెలిపారు. ఈ అంశాన్ని కౌన్సిల్‌ సమావేశం లో చర్చించకుండా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశాన్ని యథావిధిగా ప్రతిపాదించడంతో షాడో సమావేశంలో అభ్యంతరం తెలిపిన కౌన్సిలర్లు  వ్యతిరేకించారు. అయినా అమోదించేందుకు ప్రయ త్నించడంతో పెద్ద దుమారమే రేగింది. అధికార పార్టీ సభ్యుడు వన్నెంరెడ్డి శ్రీను పోడియం ముందు బైఠాయించగా ఈ అంశంపై వైస్‌ చైర్మన్‌ కామన నాగిని, కౌన్సిలర్లు గంగ రాజు, సఖినేటిపల్లి సురేష్‌ అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో చైర్‌ పర్సన్‌ బర్రి వెంకటరమణ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఈ అంశాన్ని ఎక్కడ అమోదిస్తారోనని అప్పటికప్పుడు డిసెంట్‌ రాసి కమి షనర్‌ శ్రీనువాస్‌కు ఇచ్చారు. దీనివల్ల ఈ అంశాన్ని అమోదిస్తున్నట్టు మినిట్‌ బుక్‌లో రాసే అవకాశం లేకుండా పోయింది. అయితే కమిషనర్‌ డిసెంట్‌ను అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంచారు.  పార్టీ వ్యవహారం రచ్చకెక్కడంతో అఽధినాయకులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టినా ఇద్దరు, ముగ్గురు కౌన్సిలర్లు ససేమిరా అనడంతో సమస్య కొలిక్కిరాలేదు.అధికార పార్టీలో కొందరు చైర్‌పర్సన్‌ వెంకట రమణ, ఆమె భర్త జయరాజుల వ్యవహారాలపై కొంతకాలంగా గుర్రుగా ఉంటున్నారు. ఇప్పుడు ట్యాంకర్‌ రూపంలో బయటపడ్డాయి. వ్యవహారం చెయ్యి దాటిపోకుండా పార్టీ ముఖ్య నేతలు రాజీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

  వైసీపీ కౌన్సిలర్‌పై ఫిర్యాదు
నరసాపురం, మే 26 : మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బర్రి వెంకట రమణ భర్త, వైసీపీ కౌన్సిలర్‌ జయరాజు, మరో నలుగురిపై వైసీపీ నాయకుడు వనమాల శ్రీనివాస్‌ భార్య ప్రగతి గురువా రం రాత్రి ఫిర్యాదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి చెప్పారు. శ్రీనివాస్‌ ఇటీవల పట్టణంలో పందుల బెడద, డ్రెయిన్లు, కంపోస్టు యార్డు వంటి సమస్యలపై స్పందనలో ఫిర్యాదులు చేశారు. రెండు రోజల క్రితం కురిసిన వర్షానికి డ్రెయిన్‌ పొంగిపొర్లుతున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై చైర్‌పర్సన్‌ భర్త జయరాజు తమ ఇంటికి వచ్చి దుర్భాషలాడినట్టు ప్రగతి ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ తెలిపారు. దీన్ని కోర్టుకు నివేదించి, తదుపరి ఆదేశాలకనుగుణంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-05-27T06:05:04+05:30 IST