యోగాతో ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-21T05:00:58+05:30 IST

ఇటీవల ఆరోగ్య పరరిరక్షణకు ప్రతిఒక్కరూ ప్రాధాన్యత ఇస్తున్నారు.

యోగాతో ఆరోగ్యం
ఆసనాలు నేర్పుతున్న యోగా గురువు పతంజలి రెడ్డి

నేడు  అంతర్జాతీయ యోగా దినోత్సవం

తణుకు, జూన్‌ 20: ఇటీవల ఆరోగ్య పరరిరక్షణకు ప్రతిఒక్కరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. పెరిగిపోయిన కాలుష్యం, జీవన విధానం తదితర కారణాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతు న్నాయి. ఈ నేపథ్యంలో అనేక రకాల వ్యాయామాలు చేస్తు న్నారు. వాటిలో యోగా కూడా ఉన్నది. యోగా సాధనతో ఆరోగ్యంగా తయారవుతున్నా రు. ప్రధానంగా యోగా గురు వు రవిశంకర్‌ గురుజీ సారధ్య ంలో ఉన్న ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ తరుపున పైడిపర్రుకు చెందిన కూను మణి సంవత్సరాల తరబడి తణుకు పరిసరాలతో పాటు తాడేపల్లిగూడెం ప్రాం తాల్లోను ఉచితంగా యోగా నేర్పించి వేలాది మందికి ఆరోగ్య దాతగా ఉన్నారు. ఉచి తంగా ఆయుర్వేద వైద్యులచే పరీక్షలు చేసి సంబంధించిన ఆసనాలు నేర్పించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. పతాంజలి యోగా కల్చరల్‌ ట్రస్టు ద్వారా కర్రి శ్రీనివాసరెడ్డి రామ్‌దేవ్‌ బాబా శిష్యుడుగా ఉంటూ ఎంతో మందికి యోగా నేర్పుతున్నారు. తణుకు పరిసరాల్లో ఎన్‌జీవో హోమ్‌లో ఉచితంగా నేర్పుతున్నారు. ట్రుస్టు ద్వారా పేదలకు దుప్పట్లు, మొక్కలు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడతున్నారు



Updated Date - 2021-06-21T05:00:58+05:30 IST