జీతాలు ఇప్పించండి

ABN , First Publish Date - 2021-03-07T05:06:32+05:30 IST

జిల్లాలో ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందిం చడానికి జిల్లాలో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ట్రామా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

జీతాలు ఇప్పించండి

ఎనిమిది నెలలుగా ఇబ్బందులు పడుతున్నాం

 ట్రామాకేర్‌ సిబ్బంది వేడుకోలు 

ఏలూరు క్రైం, మార్చి 6 : జిల్లాలో ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందిం చడానికి జిల్లాలో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ట్రామా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 32 మంది సిబ్బంది ట్రామాకేర్‌లో వివిధ రకాల హోదాల్లో ఉద్యోగాలు చేస్తూ 24 గంటలు విధులను నిర్వర్తిస్తు న్నారు. గత ఏడాది జూలై నెల నుంచి ఇప్పటి వరకూ వారికి జీతాలు రాకపోవడంతో తాము ఎలా జీవించాలంటూ వారు వాపోతున్నారు. అధి కారులను వారు ప్రశ్నించగా తాము ఏమి చేయలేమని ప్రభుత్వం వద్దే బిల్లు పెండింగ్‌లో ఉందంటూ చెప్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇదేవిధంగా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికు లూ సతమతమవుతున్నారు. జీతాలు లేకపోవడంతో కనీసం  డ్యూటీకి వెళ్లడానికి ఆటో ఛార్జీలు కూడా లేవంటూ వాపోతున్నారు. దీనిపై డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ వివరణ ఇస్తూ ట్రామాకేర్‌ సిబ్బం దికి జులై నుంచి జీతాలు ఆగిపోయామని, ఈ విషయాన్ని వైద్య విధాన పరిషత్‌ రాష్ట్ర కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పారిశుధ్య కార్మికులు థర్డుపార్టీ కాంట్రాక్టులో పని చేస్తున్నారు. వారికి కాంట్రాక్టరు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి కూడా త్వరలోనే కాంట్రాక్టర్‌ జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారన్నారు. 

Updated Date - 2021-03-07T05:06:32+05:30 IST