మొదటిదే.. తుది జాబితా

ABN , First Publish Date - 2021-03-07T05:14:42+05:30 IST

పోల వరం ప్రాజెక్ట్‌ ఆర్‌అండ్‌ఆర్‌ జాబి తాను యధావిధిగా విడుదల చే యడంతో కొంతమంది నిర్వాసి తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుం డగా దళారుల్లో గుబులు ప్రారం భమైంది.

మొదటిదే.. తుది జాబితా
పోలవరం ప్రాజెక్టు వద్ద మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఎంపీ శ్రీధర్‌, ఎమ్మెల్యే బాలరాజు

ఆర్‌అండ్‌ఆర్‌ నిర్వాసితుల జాబితా విడుదల 

నిర్వాసిత గ్రామాల్లో వివరాల సేకరణ

పేర్లు రాక గగ్గోలు.. దళారుల గుండెల్లో రైళ్లు

వేలేరుపాడు, మార్చి 6 :  పోల వరం ప్రాజెక్ట్‌ ఆర్‌అండ్‌ఆర్‌ జాబి తాను యధావిధిగా విడుదల చే యడంతో కొంతమంది నిర్వాసి తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుం డగా దళారుల్లో గుబులు ప్రారం భమైంది. 2017లో నిర్వాసితుల జాబితాను రూ పొందించారు. షాన్‌మోహన్‌ సబ్‌ కలెక్టర్‌గా ఉం డగా ఆర్‌అండ్‌ఆర్‌ సర్వే నిర్వహించి జాబితా విడుదల చేశారు. తరువాత కొన్ని ఫిర్యాదులు రావడంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలా ల్లో సుమారు 4,500 కుటుంబాలను అనర్హుల పేరుతో ఆర్‌అండ్‌ఆర్‌ జాబితా నుంచి తొలగించా రు. వీరిలో కొంతమంది స్థానికంగా నివాసం ఉండటం లేదని, ఉంటున్నా రేషన్‌, ఆధార్‌ కార్డు లు లేవన్న కారణంగా జాబితా నుంచి తొలగిం చారు. తిరిగి విచారణ జరిపించి అర్హులైతే జాబితాలో చేరుస్తామని అధికారులు అప్పట్లో హామీ ఇచ్చారు. తరువాత షాన్‌మోహన్‌ బదిలీ పై వెళ్లగా ఆయన స్థానంలో హరేందిరప్రసాద్‌ కుక్కునూరు సబ్‌కలెక్టర్‌గా వచ్చారు ఆయన కూడా అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి దరఖాస్తులు చేసుకున్నారు. ఈలోగా దళారులు రంగంలోకి దిగి ప్యాకేజీలు ఇప్పిస్తామంటూ నిర్వాసితులను నమ్మ బలికి వారి నుంచి భారీగానే వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. దళారులకు అధికారులు వంత పాడినట్టు అప్ప ట్లో ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ఆర్‌ అండ్‌ఆర్‌ నష్టపరిహారం రేపు, మాపో అంటూ ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. 

కంగుతున్న నిర్వాసితులు

తాజాగా ఏప్రిల్‌ నాటికి గ్రామాలను ఖాళీ చేయాలంటూ అధికారులు గ్రామాల్లో దండోరా వేయించారు. నిర్వాసితులకు సంబంధించి స్థాని కంగా ఉంటున్నట్టుగా ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరించడం ప్రారం భించారు. ఇటీవల అర్హుల తుదిజాబితా విడుదల చేశారు. అధికారులు తీసుకువచ్చిన జాబితాను చూసి నిర్వాసితులు కంగుతిన్నారు. అప్పట్లో సబ్‌ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ విడుదలచేసిన తొలి జాబి తానే తుది జాబితాగా విడుదలచేశారు. అనర్హుల పేరుతో జాబితా నుంచి తొలగించిన ఏ ఒక్కరికీ ఈ జాబితాలో చోటు దక్క లేదు. దళారుల మాట విని పెద్ద ఎత్తున సొమ్ములు ముట్టచెప్పి మోసపోయామని, రెండు విధాలా నష్టపోయా మంటూ నిర్వాసితులు  దళారులపైకి దండెత్తు తున్నారు. దళారులు నిర్వాసితుల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ముల్లో కొంతభాగం అధికా రులకు ముట్టచెప్పినట్టు సమాచారం. దళారుల తో కుమ్మకైన అధికారులు కొందరు బదిలీలపై వెళ్లిపోయారు. దీంతో దళారుల గుండెల్లో గుబు లు మొదలైంది.


పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల ప్యాకేజీ  : ఎంపీ కోటగిరి

పోలవరం, మార్చి 6 : పోలవరం ప్రాజెక్టు నిర్మా ణానికి సహకరించిన నిర్వాసితులకు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ త్వరలో అందజేస్తామని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ తెలిపారు. ప్రాజెక్టు స్పిల్‌ వే బ్రిడ్జి,. రేడియల్‌ గేట్ల అమరికను ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలను సీఈ సుధాకర్‌బా బు, మేఘా ఇంజనీరింగ్‌ జీఎం అంగర సతీష్‌ తెలిపారు. అనంతరం గూటాల పంచాయతీ ఎన్నికల విజయోత్సవ సభలో మాట్లాడుతూ సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో నిర్వాసితుల ప్యాకేజీని రూ.6 లక్షల నుంచి 10 లక్షలకు, అతి తక్కువ నష్టపరిహారం పొందిన వారికి రూ.5 లక్షల వరకు పరిహారం పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు.. వీటి అమలుకు త్వరలో జీవో వెలువడనుందని పేర్కొన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని చెప్పారు. మండల పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎమ్మెల్యే బాలరాజు మంత్రయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-03-07T05:14:42+05:30 IST