నూరుశాతం టీకాలే లక్ష్యం కావాలి

ABN , First Publish Date - 2021-10-24T05:22:33+05:30 IST

కరోనా టీకాలు నూరుశాతం పూర్తిచేయడమే లక్ష్య మని జిల్లా పంచాయతీ అధికారి కె.రమేష్‌బాబు అన్నారు.

నూరుశాతం టీకాలే లక్ష్యం కావాలి
పెదవేగిలో మాట్లాడుతున్న డీపీవో రమేష్‌బాబు

డీపీవో రమేష్‌బాబు వెల్లడి

పెదవేగి, అక్టోబరు 23 : కరోనా టీకాలు నూరుశాతం పూర్తిచేయడమే లక్ష్య మని జిల్లా పంచాయతీ అధికారి కె.రమేష్‌బాబు అన్నారు. పెదవేగి మండల పరి షత్‌ కార్యాలయాన్ని శనివారం ఉదయం సందర్శించిన ఆయన కూచింపూడిలో కరోనా నివారణ టీకాల పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం టీకాలను ముమ్మరంగా చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ టీకాలను వేయించుకోవాలన్నారు. ఈవిషయంలో ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. టీకాలపై ఇప్పటికీ కొంతమంది అపోహలు పడు తూ టీకాలు వేయించుకోవడానికి వెనుకాడుతున్నారని, అలాంటివారిని గుర్తించి, వారిలో ఉన్న భయాలను తొలగించి, టీకాలు వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంక ల్పంపై గ్రామాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన గ్రామాల అభి వృద్ధిపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. డీపీవో వెంట ఎంపీడీవో ఎం.బలరామరాజు, ఏపీవో హేమలత, గ్రామ కార్యదర్శి ప్రసాద్‌ ఉన్నారు. 


కరోనా నివారణకు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

దెందులూరు, అక్టోబరు 23 : కరోనాను నివారించేందుకు భౌతిక దూరం పాటిం చడం, మాస్కు ధరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరోనా నివారణ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తహసీల్దార్‌ వి.నాంచారయ్య సూచించారు. పోతునూరు సచివాలయంలో శనివారం టీకా ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న వ్యాక్సిన్‌  ప్రక్రి యను పరిశీలించారు. గ్రామ సర్పంచ్‌ బోదుల స్వరూప్‌ (నాని), బ్యాంకు అధ్యక్షుడు దూళ్ళిపాళ్ళ నాగేంద్రవరప్రసాద్‌ (బజ్జి) వైద్య సిబ్బంది ఉన్నారు. కొవ్వలిలో సర్పంచ్‌ ఇంతేటి మధులత, గంగాధరరావు, బ్యాంకు అధ్యక్షుడు ఆత్కూరి సునీల్‌రాజా, ఎంపీటీసీ లక్ష్మి సరోజి ఆధ్వర్యంలో, గోపన్నపాలెంలో సర్పంచ్‌ కోటి నాగమల్లేశ్వరి, కుమార్‌ ఆధ్వర్యంలో, చల్లచింతలపూడిలో సర్పంచ్‌ బైగాని వెంకటేశ్వరమ్మ, శ్రీమన్నారాయణ ఆధ్వర్యం లో కరోనా నివారణ వ్యాక్సిన్‌ వేశారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలి

పెదపాడు, అక్టోబరు 23 : కొవిడ్‌ నియంత్రణలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ అం దిస్తారని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను స క్రమంగా సమర్థవంతగా నిర్వహిం చాలని డీఎల్‌పీవో సంపత్‌కుమారి తెలిపారు. వసంతవాడ సబ్‌సెంటర్‌లో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను శ నివారం పరిశీలించారు. వ్యాక్సినేషన్‌ తీరును పరిశీలించి రికార్డులను పరిశీలిం చారు. అనంతరం పారిశుధ్యం, తాగు నీరు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ, వైద్యసిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-10-24T05:22:33+05:30 IST