పూళ్లలో రైతు మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

ABN , First Publish Date - 2021-01-22T05:44:24+05:30 IST

కుమ్మరకుంటకు చెందిన బత్తిన బుల్లబ్బాయి(40) అనే రైతు పొలంలో గురువారం సాయంత్రం గడ్డి కోస్తూ పంట బోదెలో పడి మృతి చెందడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

పూళ్లలో రైతు మృతి.. భయాందోళనలో గ్రామస్థులు
రోదిస్తున్న బంధువులు

భీమడోలు, జనవరి 21 : కుమ్మరకుంటకు చెందిన బత్తిన బుల్లబ్బాయి(40) అనే రైతు పొలంలో గురువారం సాయంత్రం గడ్డి కోస్తూ  పంట బోదెలో పడి మృతి చెందడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే వింత వ్యాధి పీడి స్తున్న నేపథ్యంలో ఇది మరింత భయాన్ని కలిగిస్తోంది. బుల్ల బ్బాయి గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు ప్రకటించా రు. రైతుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఉదయం పొలంలో మందు పిచికారీ చేసి వచ్చాడు. సాయంత్రం గడ్డి కోయడానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ నేపథ్యంలో రైతులు, కూలీలు పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు మైక్‌లో ప్రచారం చేయిస్తున్నారు. 

వింత వ్యాఽధి తగ్గుముఖం పట్టింది. పూళ్ళ,  భీమడోలు, గుండుగొలనులలో గురువారం ఒక్క కేసు నమోదు కాలేదు. దీంతో వైద్యులు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి భీమడోలు బీసీ కాలనీకి చెందిన శంకర్‌ అనే వ్యక్తికి ఫిట్స్‌ రావడంతో సీహెచ్‌సీకి తరలించి చికిత్స చేశారు. ఉదయం డిశ్చార్జి చేశారు. మొత్తం కేసులు 34 కాగా, 28 మంది ఇంటి వద్ద కోలు కుంటుండగా, ఆరుగురు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-01-22T05:44:24+05:30 IST