అమెరికా కాలేజీలో పోర్నోగ్రఫీపై కోర్సు

ABN , First Publish Date - 2022-04-25T08:21:13+05:30 IST

పోర్నోగ్రఫీ(అశ్లీల చిత్రాలు)ని ప్రపంచమంతా ఒక బూతుగా భావిస్తుంది. అలాంటిది అమెరికాలోని ఒక కాలేజీ పోర్నోగ్రఫీలో కోర్సును ప్రవేశ పెట్టింది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ మే 3వ తేదీ నుంచి జూన్ 4వ తేదీవరకు స్వల్ప వ్యవధి...

అమెరికా కాలేజీలో పోర్నోగ్రఫీపై కోర్సు

పోర్నోగ్రఫీ(అశ్లీల చిత్రాలు)ని ప్రపంచమంతా ఒక బూతుగా భావిస్తుంది. అలాంటిది అమెరికాలోని ఒక కాలేజీ పోర్నోగ్రఫీలో  కోర్సును ప్రవేశ పెట్టింది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ మే 3వ తేదీ నుంచి జూన్ 4వ తేదీవరకు క్లాసులు ఉంటాయని తన వెబ్ సైట్‌లో ప్రకటన విడుదల చేసింది.


అమెరికాలోని ఉతాహ్ రాష్ట్రంలో ఉన్న వెస్ట్ మినిస్టర్ కాలేజీ ప్రతి ఏటా విద్యార్ధులకు స్వల్పకాలిక కోర్సులను అందిస్తూ ఉంటుంది. ఈ ఏడాది లైంగిక విజ్ఞానం పెంపొందించటానికి పోర్నోగ్రఫీ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. వెస్ట్‌మిన్‌స్టర్ సాల్ట్ లేక్ సిటీలోని ఒక ప్రైవేట్, లాభాపేక్షలేని, గుర్తింపు పొందిన,  లిబరల్ ఆర్ట్స్ కళాశాల . సామాజిక అంశాలను విశ్లేషించేందుకు, వివాదాస్పద అంశాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇది ఒక అవకాశమని  కాలేజ్  తెలిపింది. 


అయితే, విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతిలో అశ్లీల చిత్రాలను కలిసి చూడటం చాలా అసహ్యకరమైన వ్యవహారమంటూ కళాశాల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు విమర్శలు చేశారు. అయినా కాలేజీ యాజమాన్యం వివరణ ఇస్తూ కోర్సులో భాగంగా లెక్చరర్లు, విద్యార్థులు తరగతి గదిలోనే కలిసి కూర్చుని పోర్న్‌ సినిమాలను తిలకిస్తూ స్త్రీ, పురుష లైంగిక సంబంధాలపై జాతి, వర్గం, లింగ విభేదాల ప్రభావం గురించి చర్చలు జరుపుతారని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.


పోర్నోగ్రఫీపై కోర్సు ఏంటని సర్వత్రా విమర్శలు మరింత తీవ్రమవడంతో కోర్సుల జాబితాలో నుంచి పోర్నోగ్రఫీ తొలిగిస్తున్నట్లు కాలేజీ చెబుతున్నా.. ఇప్పటికీ ఆ కోర్సు అందుబాటులో ఉందని కొందరు విద్యార్థులు చెబుతున్నారు.

Updated Date - 2022-04-25T08:21:13+05:30 IST