రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ పూర్తి చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-27T05:29:20+05:30 IST

రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ పూర్తి చేయాలి: కలెక్టర్‌

రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ పూర్తి చేయాలి: కలెక్టర్‌

వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 26: రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) వంద శాతం ప్రభుత్వానికి అప్పగించాలని, నవంబరు 30లోపు యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ను పూర్తి చేయాలని కలెక్టర్‌ బి.గోపి ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో డీఎస్‌వో అధ్యక్షతన ఖరీఫ్‌, రబీకి సంబంధించిన సీఎంఆర్‌ రైస్‌పై రైస్‌ మిల్లర్లతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌లో 1,21,545 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కాగా 99 శాతం సీఎంఆర్‌ పూర్తి అయిందన్నారు. యాసంగికి సంబంధించి 2,78,305 మె ట్రిక్‌ టన్నులకు గాను ఇప్పటి వరకు 55.74 శాతం సీఎంఆర్‌ని మిల్లర్లు అప్పగిం చాలని కలెక్టర్‌ అన్నారు. మిగిలిన వాటిని త్వరలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఎస్‌వో లక్ష్మిభవాని, ఎఫ్‌సీఐ అధికారులు, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T05:29:20+05:30 IST