డీఎల్‌ఎడ్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-11-25T08:10:13+05:30 IST

డీఎల్‌ఎడ్‌, డీపీఎల్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైట్‌ ప్రిన్సిపాల్‌ కె.నారాయణరెడ్డి తెలిపారు.

డీఎల్‌ఎడ్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, నవంబరు 24: డీఎల్‌ఎడ్‌, డీపీఎల్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైట్‌ ప్రిన్సిపాల్‌ కె.నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం హన్మకొండలోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలో సీఎస్‌, డీవోల సమావేశం జరిగింది. ఈసందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి డిసెంబరు 10 వరకు జరుగనున్న పరీక్షలకు రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఫస్టియర్‌ పరీక్షకు 280 మంది, సెకండియర్‌ పరీక్షకు 330 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా డిసెంబరు ఒకటిన జరగాల్సిన ద్వితీయ సంవత్సర పరీక్ష(పేపర్‌-2) 11న తేదీన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-25T08:10:13+05:30 IST