అభివృద్ధి పనులన్నీ పూర్తి కావాలి

ABN , First Publish Date - 2020-11-25T08:19:06+05:30 IST

జిల్లాలోని అభివృద్ధి పనులన్నీ డిసెంబరులో పూర్తి కావాలని కలెక్టర్‌ హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రైతు వేదికల నిర్మాణాల చెల్లింపులు,...

అభివృద్ధి పనులన్నీ పూర్తి కావాలి

 అధికారుల సమావేశంలో కలెక్టర్‌ ఆదేశం


వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, నవంబరు 24: జిల్లాలోని అభివృద్ధి పనులన్నీ డిసెంబరులో పూర్తి కావాలని కలెక్టర్‌ హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రైతు వేదికల నిర్మాణాల చెల్లింపులు, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులపైన మండలాల వారీగా ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీరాజ్‌ శాఖ డీఈ, ఏఈలతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎఫ్‌టీవోలను అప్‌లోడ్‌ చేయాలని, రైతు వేదికల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇంకా మార్కింగ్‌ చేయని చోట వెంటనే ప్రారంభించాలన్నారు. కొన్ని గ్రామాల్లో పనులు బాగానే జరుగుతున్నాయని, మిగ తా గ్రామాల్లో పనులు వేగవంతం కావాలన్నారు. మండలాల వారీగా యాక్షన్‌ ప్లాన్‌ అధికారులు ఇవ్వాలని, ఏ గ్రామంలో నిర్మాణ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, పూర్తి కావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో చెప్పాలన్నారు.


డీపీవో, ఎంపీడీవోలు ప్రతీ గ్రామాన్ని సం దర్శించి క్రిమిటోరియం పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. మం డలాల వారీగా వైకుంఠధామాల పనులను ఎంపీడీవోలు ఏఈవోలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న చోట ఎంబీ రికార్డు కావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీపీవో రాజారావు, డీఆర్‌డీవో సంపత్‌రావు, డీపీవో చంద్రమౌళి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T08:19:06+05:30 IST