Advertisement

రామలింగేశ్వరాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌

Nov 25 2020 @ 02:56AM

బచ్చన్నపేట, నవంబరు 24: మండలంలోని బండనాగారం గ్రామ సమీపంలోని రామలింగేశ్వరాలయాన్ని కలెక్టర్‌ నిఖిల మంగళవారం రాత్రి సందర్శించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. కాగా ఆలయ ప్రాశస్త్యాన్ని పూజారి అంజనేయులును అడిగి తెలుసుకున్నారు. 60 ఎకరాల పరుపుబండపై ఉన్న ఈ జంట ఆలయాల సమీపంలోని గుండాలు, విగ్రహాలను పరిశీలించారు. కార్తీక పౌర్ణమి రోజు ఆలయాన్ని మరోమారు సందర్శిస్తానని, అభివృద్ధి కోసం పురావస్తుశాఖకు లేఖ రాస్తానని అన్నారు. 

Follow Us on:
Advertisement