జ్యుడీషియల్‌ జిల్లాలు

Published: Sat, 21 May 2022 00:34:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జ్యుడీషియల్‌ జిల్లాలు

కొత్త జిల్లాలకు కొత్త కోర్టులు

ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ఇక మరింత చేరువలో న్యాయం

జూన్‌ 2 నుంచి జిల్లా కోర్టుల్లో కార్యకలాపాలు

24వ తేదీలోపు జిల్లాల వారీగా కేసుల బదిలీ

సుబేదారిలోనే హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కోర్టులు


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో న్యాయపాలన మరింత సులభతరం కానుంది. కోర్టులు ప్రజలకు, కక్షిదారులకు చేరువకానున్నది. ఈ మేరకు రాష్ట్రంలో 33 రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా 33 జుడిషియల్‌ జిల్లా కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు నూతన కోర్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2 నుంచి జిల్లా కోర్టులు ప్రారంభం కానున్నాయి.


హనుమకొండ/మహబూబాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ జిల్లాలను జ్యుడీషియల్‌ జిల్లాల ుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీ సుకుంది. కొత్త జ్యుడీషియల్‌ జిల్లాలకు సం బంధించిన సరిహద్దులు, అధికార పరిధిని గుర్తిస్తూ ఈనెల 17న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. హైకోర్టుతో పూర్తిస్థాయి సం ప్రదింపుల అనంతరం ఈ నూతన కోర్టుల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకు న్నది. 33 కోర్టులు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాల వారీగా సబార్ధినేట్‌ కోర్టుల పరిధిని నోటిఫై చేసింది. జూన్‌ 2 నుంచి జిల్లా కోర్టులు ప్రారంభం కానున్న నేప థ్యంలో ఉమ్మడి జిల్లా కోర్టులో ఉన్న కేసు లను విభజించి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆయా జిల్లాల ప్రధాన న్యాయమూర్తులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా కేసులను గుర్తించి వాటిని నూతన కోర్టులకు ఈ నెల 24వ తేదీలోగా బదిలీ చేయాలని పేర్కొన్నారు. 


హనుమకొండ జిల్లా కేంద్రం సుబేదారిలోని కోర్టు సముదాయాల ప్రాంగణంలోనే హనుమకొండ జిల్లా కోర్టు ఉంటుంది. ఈ జిల్లా పరిధిలోకి వచ్చే పరకాలలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, కాజీపేటలోని ఫస్ట్‌క్లాస్‌ పుల్‌ రైల్వే కోర్టు పరిఽధులు మారాయి. హనుమకొండ జిల్లా కోర్టు పరిధిలోకి హనుమకొండ, కాజీపేట, ధర్మసాగర్‌, వేలేరు, ఐనవోలు, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్‌ మండలాలు వస్తాయి. ఇదే జిల్లా పరిధిలోని పరకాల ఫస్ట్‌క్టాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు పరిధిలోకి పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాలు వస్తాయి. 


వరంగల్‌ జిల్లా కోర్టు.. హనుమకొండ జిల్లా కేంద్రం సుబేదారిలోని కోర్టు సముదాయాల ప్రాంగణంలోనే పని చేస్తుంది. ఈ కోర్టు పరిధిలోకి వరంగల్‌, ఖిలా వరంగల్‌, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి, గీసుకొండ మండలాలు ఉంటాయి. ఇదే జిల్లా పరిధిలోని నర్సంపేట ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు పరిధిలోకి నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ మండలాలు వస్తాయి.


భూపాలపల్లి జిల్లాలో జిల్లా కోర్టుతో పాటుగా సబార్డినేట్‌ జడ్జీస్‌ కోర్టు, జ్యుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ కోర్టు పరిధిలోకి జిల్లాలో ఉన్న భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్‌, కాటారం, మహదేవపూర్‌, పలిమెల, మహామత్తారం మండలాలు రానున్నాయి. 


ములుగు జిల్లాలో కూడా జిల్లా కోర్టుతో పాటు సబార్డినేట్‌ జడ్జీస్‌ కోర్టు, జ్యుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు ఏర్పాటు కానున్నాయి. ఈ కోర్టు పరిధిలోకి ఏటూరునాగారం, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, ములుగు, వెంకటాపురం, వెంకటాపూర్‌, వాజేడు మండలాలు రానున్నాయి. 


జనగామ జిల్లా కోర్టు పరిధిలోకి జనగామ, బచ్చన్నపేట, లింగాలఘనపురం, నర్మెట్ట, తరిగొప్పుల, దేవరుప్పుల, పాలకుర్తి, రఘునాథపల్లి, కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌ఘడ్‌, చిల్పూరు మండలాలు వచ్చాయి. ఇప్పటివరకు జనగామ కోర్టు పరిధిలోకి జనగామ, బచ్చన్నపేట, లింగాలఘనపురం, నర్మెట్ట, తరిగొప్పుల, దేవరుప్పుల, పాలకుర్తి, రఘునాథపల్లితో పాటు సిద్ధిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెళ్లి, దూల్మిట్ట, మద్దూరు మండలాలు ఉన్నాయి. జిల్లాలోని కొడకండ్ల మండలం తొర్రూరు కోర్టు పరిధిలో ఉండగా, స్టేషన్‌ఘన్‌పూర్‌, చిల్పూరు, జఫర్‌ఘడ్‌ మండలాలు వరంగల్‌ కోర్టు పరిధిలో ఉన్నాయి. జ్యుడీషియల్‌ కోర్టులు ఏర్పాటు కానుండడంతో చేర్యాల, కొమురవెళ్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలు సిద్ధిపేట జిల్లాకు వెళ్లిపోగా, వరంగల్‌ కింద ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌ఘడ్‌, చిల్పూరు, తొర్రూరు కోర్టు కింద ఉన్న కొడకండ్ల మండలాలు జనగామ కోర్టు పరిఽధికి రానున్నాయి. అంతేకాక ప్రస్తుతం జనగామ కోర్టు సముదాయంలో రెండు సీనియర్‌ సివిల్‌ జడ్జి, ఒక జూనియర్‌ సివిల్‌ జడ్జి, ఒక సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌, ఒక ఫోక్సో, ఒక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఉన్నాయి. 


మహబూబాబాద్‌ జిల్లా కోర్టు పరిధిలో మహబూబాబాద్‌, కురవి, కేసముద్రం, డోర్నకల్‌, బయ్యారం, గార్ల, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలు కొనసాగుతాయి. ఇదే జిల్లా పరిధిలోని తొర్రూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు పరిధిలో తొర్రూరు, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్దవంగర మండలాల లావాదేవీల కేసులు కొనసాగుతాయి. కాగా, గతంలో తొర్రూరు కోర్టు పరిధిలో ఉన్న రాయపర్తి మండలం హనుమకొండ జిల్లా కోర్టుకు చేర్చారు. అదే విధంగా తొర్రూరు పరిధిలోని కొడకండ్ల మండలాన్ని జనగామ జిల్లా కోర్టు పరిధికి చేర్చారు. పూర్వంలో వరంగల్‌ జిల్లా నర్సంపేట కోర్టు పరిధిలో ఉన్న గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలను మహబూబాబాద్‌ కోర్టు పరిధిలోకి చేర్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కోర్టు పరిధిలో ఉన్న బయ్యారం, గార్ల మండలాలను కూడా మహబూబాబాద్‌ కోర్టు పరిధికి చేర్చారు. 


ఏడు కోర్టులు హనుమకొండ కాంప్లెక్సులోనే...

హనుమకొండ సుబేదారిలోని కోర్టు భవన సముదాయంలో ప్రస్తుత ఉన్న మొత్తం పది జూనియర్‌ సివిల్‌ కోర్టుల్లో మూడు మినహా మిగతావి యథాతథంగా ఇక్కడే కొనసాగుతాయి. జిల్లా ప్రధాన జడ్జి కోర్టు, ఒకటో అదనపు జిల్లా జడ్జి, రెండో అదనపు జిల్లా జడ్జి, మూడో అదనపు జిల్లా జడ్జి  (ఫ్యామిలీ కోర్టు), నాలుగో అదనపు జిల్లా జడ్జి,  ఏడో అదనపు జిల్లా జడ్జి కోర్టు (ఎస్సీ, ఎస్టీ కేసులను విచారించే కోర్టు), తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు  (మహిళలపై అత్యాచారాల కోర్టు), పదో అదనపు జిల్లా కోర్టు (మైనర్‌ బాలికలపై అత్యాచార కేసుల విచారణ కోర్టు) వీటిలో ఉన్నాయి. అయిదో అదనపు జిల్లా కోర్టు జనగామకు, ఆరో అదనపు జిల్లా కోర్టు మహబూబాబాద్‌కు, ఎనిమిదో అదనపు జిల్లా కోర్టు భూపాలపల్లికి వెళ్ళింది. ఇవి జూన్‌2 నుంచి పని చేయడం ప్రారంభమవుతాయి. 


హనుమకొండ, వరంగల్‌కు సంబంధించి ఏ కోర్టును  ప్రధాన జిల్లా కోర్టుగా చేస్తారో, ఏ సీనియర్‌ సివిల్‌ కోర్టును ఏ జిల్లాకు పంపుతారో ఇంకా తెలియదు. పది కోర్టులు పాత జూరిడిక్షన్‌లోనే ఉంటాయి. వీటిని ఇంకా విభజించలేదు. ఇవి హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు సంబఽంధించిన కోర్టులు. ప్రిన్సిపల్‌ డీజే కోర్టు, ప్రధాన జిల్లా జడ్జి కోర్టు వరంగల్‌కు, ప్రధాన జిల్లా జడ్జి కోర్టు హనుమకొండకు ఏర్పాటయ్యాయి. ఒకటో అదనపు జిల్లా జడ్జి కోర్టును వరంగల్‌ జిల్లా జడ్జి చేస్తారా? రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టును వరంగల్‌ జిల్లాకు కోర్టు జడ్జి చేస్తారా? ఇప్పటి వరకు నిర్ణయం జరగలేదు. 


కోర్టు సముదాయంలో ప్రస్తుతం మూడు సీనియర్‌  సివిల్‌ జడ్జి కోర్టులు ఉన్నాయి. ఒకటి ప్రధాన సీనియర్‌ సివిల్‌ జడ్జి, మరోకటేమో రెండో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి, మూడో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు వీటిలో ఉన్నాయి. వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు సంబంధించిన కోర్టులు సుబేదారిలోని కోర్టు సముదాయాల్లోనే పని చేస్తాయి. పది జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు విభజించబడలేదు. ఎక్కడికి కేటాయించలేదు. తర్వాత  కేటాయించే అవకాశాలున్నాయి. తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. మూడు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవి కూడా భవిష్యత్తులో వేరే జిల్లాలకు కేటాయించవచ్చు. మిగతా ఏడు కోర్టులు ఉంటాయి,

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.