వాటె ఛాన్స్... వారికి... ఇక శాశ్వతంగా ‘వర్క్ ఫ్రం హోం’

ABN , First Publish Date - 2021-07-30T22:55:58+05:30 IST

రోనా నేపధ్యంలో పలు సంస్థలు ఇప్ప‌టికీ త‌మ ఉద్యోగుల‌కు ‘వ‌ర్క్ ఫ్ర‌ం హోం’ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న విషయం తెలిసిందే.

వాటె ఛాన్స్... వారికి... ఇక శాశ్వతంగా ‘వర్క్ ఫ్రం హోం’

వాషింగ్టన్ : క‌రోనా నేపధ్యంలో పలు సంస్థలు ఇప్ప‌టికీ త‌మ ఉద్యోగుల‌కు ‘వ‌ర్క్ ఫ్ర‌ం హోం’ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక... అవ‌కాశాలున్న మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాట పడుతున్నాయి. క‌రోనా కేసులు త‌గ్గిన‌ప్ప‌టికీ తీవ్ర‌త పొంచి ఉండ‌టంతో ప‌లు టెక్ కంపెనీలు ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నాయి.  ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ త‌మ ఉద్యోగుల‌కు ‘శాశ్వ‌తంగా ఇంటినుంచి ప‌ని’ వెసులుబాటును క‌ల్పించిన విషయం తెలిసిందే.  ఇప్పుడు మ‌రో దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు అనుబంధంగా ప‌నిచేస్తున్న సామాజిక మాధ్య‌మం ‘లింక్డిన్’ కూడా ఇదే క్రమంలో నిర్ణయం తీసుకుంది. వివరాలిలా ఉన్నాయి. 


లింక్డిన్‌లో ప‌నిచేసే ఉద్యోగులు ఇంటినుంచి ప‌నిచేసే వెసులుబాటును క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.  అత్య‌వ‌స‌ర సిబ్బంది మాత్రం కార్యాలయాలకు రావాలని, ఇతర ఉద్యోగులు ఇంటినుంచి ప‌నిచేయ‌వ‌చ్చని తెలిపింది.  ఇంటి నుంచి ప‌నిచేసే ఉద్యోగులు త‌మ నివాస స్థ‌లాల‌ను మార్చుకుంటే అందుకణుగుణంగా వేతనాల చెల్లింపులు చెల్లిస్తామ‌ని సంస్థ తెలియ‌జేసింది.  లింక్డిన్ సంస్థలో... ప్ర‌పంచ‌వ్యాప్తంగా 16 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

Updated Date - 2021-07-30T22:55:58+05:30 IST