తన సోషల్ మీడియా అకౌంట్‌లో అసభ్యకర వీడియోలను చూసి ఖంగుతిన్న టీచర్.. దీనిపై ఆరాతీయగా చివరకు ఏం తెలిసిందంటే..

ABN , First Publish Date - 2022-04-27T15:53:07+05:30 IST

సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయినప్పటి నుంచి.. సమాచారం ఎంత సులభంగా అందుతుందో, నేరాలు కూడా అంతే సులభంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో...

తన సోషల్ మీడియా అకౌంట్‌లో అసభ్యకర వీడియోలను చూసి ఖంగుతిన్న టీచర్.. దీనిపై ఆరాతీయగా చివరకు ఏం తెలిసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయినప్పటి నుంచి.. సమాచారం ఎంత సులభంగా అందుతుందో, నేరాలు కూడా  అంతే సులభంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో బాలికలు, యువతులు, మహిళలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. సోషల్ మీడియా అకౌంట్‌లో అసభ్యకర ఫొటోలు, వీడియోలను చూసిన టీచర్ ఖంగుతింది. తన ప్రమేయం లేకుండా ఇలా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. దీంతో చివరకు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. వారి విచారణలో అసలు నిజం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు.


ఢిల్లీలోని కళాశాలలో ఓ మహిళ టీచర్‌ విధులు నిర్వర్తిస్తోంది. అదే పాఠశాలలో ఓ విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. పాఠాలు బోధించే క్రమంలో టీచర్.. అతన్ని అందరిముందూ మందలించేది. దీంతో విద్యార్థి అవమానంగా భావించాడు. ఎలాగైనా టీచర్‌పై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎలా పగ తీర్చుకోవాలనే విషయంపై వివిధ రకాలుగా ఆలోచించాడు. ఈ క్రమంలో ఫేక్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలనే దానిపై ఓ రోజు య్యూటూబ్‌లో సెర్చ్ చేశాడు. దాన్ని చూసి నకిలీ ఇన్‌స్టాగ్రాం ఖాతాను క్రియేట్ చేశాడు. టీచర్ వాట్సప్ డీపీని డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాగ్రాం ప్రొఫైల్ ఫొటోగా సెట్ చేశాడు.

నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేసిన యువకుడు... కొన్ని రోజులకు హత్యకు గురైన ప్రియురాలు, తల్లిదండ్రులు.. అసలు ఏం జరిగిందంటే..


తర్వాత ఆ ఖాతాలో అసభ్యకర ఫొటోలు, వీడియోలను షేర్ చేశాడు. అంతటితో ఆగకుండా టీచర్ సెల్ నంబర్‪‪‌ను అందులో పెట్టి, అసభ్యకర సందేశాన్ని రాశాడు. దీంతో ఆమెకు అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్లు రావడం మొదలెట్టాయి. తర్వాత అనుమానం వచ్చి ఖాతా చేక్ చేసుకుని షాక్‌కు గురైంది. తన ప్రమేయం లేకుండా తన పేరుతో ఖాతా ఉండడంతో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. చివరకు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. మొబైల్ నంబర్, ఐపీ అడ్రస్ ఆధారంగా విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మా వదిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ పక్కింటోళ్లకు కాల్ చేసి చెప్పాడా వ్యక్తి.. వాళ్లు వెళ్లి చూస్తే..

Updated Date - 2022-04-27T15:53:07+05:30 IST