వరుస కాదని తెలిసినా బాలికపై వక్ర దృష్టి.. తల్లి, భార్య సహకారంతో చివరికి అతడు చేసిన పని..

ABN , First Publish Date - 2022-03-05T22:34:33+05:30 IST

గుజరాత్‌లో ఓ వ్యక్తి వరుసకు కూతురు అయ్యే బాలికపై కన్నేశాడు. అతడికి బుద్ధి చెప్పి మందలించాల్సిన తల్లి, భార్య కూడా అతడికే సహకరించారు. చివరకు వారంతా..

వరుస కాదని తెలిసినా బాలికపై వక్ర దృష్టి.. తల్లి, భార్య సహకారంతో చివరికి అతడు చేసిన పని..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత సమాజంలో కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులకు వరుసలు, వయసు తేడాలు కనిపించడం లేదు. బాలికలు మొదలుకుని వృద్ధుల వరకూ ఎవరినీ వదలడం లేదు. మాయ మాటలు చెప్పి నమ్మించడం, అవసరం తీరాక వదిలేయడం పరిపాటిగా మారుతోంది. మోసపోయామని తెలుసుకున్న బాలికలు, యువతులు.. చివరికి ఆత్మహత్యలు చేసుకోవడం కూడా చూస్తున్నాం. గుజరాత్‌లో ఓ వ్యక్తి వరుసకు కూతురు అయ్యే బాలికపై కన్నేశాడు. అతడికి బుద్ధి చెప్పి మందలించాల్సిన తల్లి, భార్య కూడా అతడికే సహకరించారు. చివరకు వారంతా కలిసి చేసిన పని స్థానికంగా సంచలనం కలిగించింది.


గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్ జిల్లా రన్‌చర్ద్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి తల్లి కూడా వారితో పాటే ఉంటోంది. ఇదిలావుండగా రెండేళ్ల క్రితం ఆ వ్యక్తికి వరుసకు అన్న కూతురు అయ్యే బాలిక వీరింటికి వచ్చింది. బాలిక తండ్రికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పేద కుటుంబం కావడంతో పోషించడం భారమైంది. దీంతో 15ఏళ్ల కూతురిని బంధువుల ఇంట్లో ఉంచాడు. అప్పటి నుంచి బాలిక.. రన్‌చర్ద్‌ గ్రామంలోని బంధువుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలో బాలికను ఎలాగైనా అనుభవించాలని ఆమె బాబాయ్ కుట్ర పన్నాడు. రోజూ మాయమాటలు చెబుతూ ఆమెను నమ్మించాడు.

మీ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని పక్కింటోళ్లు అంటున్నా లేదని బుకాయించిందా భార్య.. పోలీసుల ఎంట్రీతో..


ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం అతడి తల్లి, భార్యకు కూడా తెలిసింది. అతన్ని మందలించాల్సిన తల్లి, భార్య.. అందుకు విరుద్ధంగా అతడికే సహకరించారు. దీంతో ఆ వ్యక్తి రెండేళ్లుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఫిబ్రవరి 28న బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం బయట పడితే పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టారు. అంతా కలిసి బాలికను వేరే గ్రామానికి తరలించి.. గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో దాచి ఉంచారు. అయితే ఈ క్రమంలో బాలిక ఎలాగోలా సొంతూరికి చేరుకుని, తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడితో పాటూ అతడి తల్లి, భార్యను కూడా అరెస్ట్ చేశారు. ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది.

‘‘నీకో బహుమతి ఇస్తా, ఊరిబయటకు వచ్చెయ్’’.. అంటూ ప్రియురాలిని పిలిచిన యువకుడు.. మాట్లాడుతూ మాట్లాడుతూ..

Updated Date - 2022-03-05T22:34:33+05:30 IST